తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. సాధారణం కంటే పగటి సమయం పెరగడం, దానికి తోడు ఎల్ నినో ప్రభావం తోడవ్వడంతో ఈ ఏడాది ఎండలు మునుపెన్నడూ లేని విధంగా నిప్పులు కురిపిస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈసారి వర్షభావ పరిస్థితులు తక్కువగా ఉండటంతో, ఎండల తీవ్రత జూలై మాసం వరకు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. మంగళవారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.3 డిగ్రీలు, నిజాంబాద్‌లో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌తో పాటు భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజాంబాద్ జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లేవారు గొడుగు, టోపీ వంటివి ధరించాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ మార్పుల పట్ల రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
VijayAI Election Campaign: ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే !!
‘వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!’ న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణలు
Jananayagan: విజయ్‌కి బిగ్ షాక్.. లోకల్ ఛానల్లో ‘జననాయగన్’ మూవీ..
Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..