వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీ, వాతావరణశాఖ ధృవీకరణ పత్రాలు అందించాలి. వ్యక్తి మరణించిన ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక డెత్ సర్టిఫికేట్, మృతుడి, వారసుల ఆధార్ జిరాక్స్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, కుటుంబ సభ్యుల డిక్లరేషన్ అందించాలి.