40 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతలు, తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడే అనంత నేలలో యాపిల్ సాగు సాధ్యమేనా? అని అందరూ ఆశ్చర్యపోతుంటే.. ‘అవును సాధ్యమే’ అని నిరూపించారు. కృష్ణారెడ్డి. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన కృష్ణారెడ్డి, ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైన యాపిల్ మొక్కలను తెప్పించి తన 15 ఎకరాల్లో సాగు చేపట్టారు. సాధారణంగా యాపిల్ సాగుకు చల్లటి వాతావరణం కావాలి. కానీ, అనంతలో ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఆయన స్ప్రింక్లర్స్ (Sprinklers) ద్వారా మొక్కలపై నిరంతరం నీటిని చిలకరిస్తూ చల్లటి వాతావరణాన్ని సృష్టించారు. అలాగే డ్రిప్ (Drip) పద్ధతిలో మొక్కకు సరిపడా నీటిని అందిస్తూ అద్భుత ఫలితాలు సాధించారు. కృష్ణారెడ్డి సాగు చేసిన ఈ తోటలో యాపిల్స్ ఏపుగా పెరిగి అద్భుతమైన దిగుబడిని ఇచ్చాయి. ఎకరాకు సుమారు టన్ను యాపిల్స్ దిగుబడి వస్తుండగా, మార్కెట్లో వీటికి మంచి ధర పలుకుతోంది. ప్రస్తుతం టన్ను ధర సుమారు 1,50,000 రూపాయల వరకు ఉంది.
మరిన్ని వీడియోల కోసం :