Headlines

Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్తే చిక్కులు తప్పవు..

Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. వెళ్తే చిక్కులు తప్పవు..


భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం భాగ్యనగరంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. సచివాలయం వద్ద ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించే అవకాశం ఉన్నందున.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.

ప్రధాన మళ్లింపులు – మూసివేత మార్గాలు:

నగరంలోని కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు పలు మార్పులు చేశారు:

సైఫాబాద్ నుండి లిబర్టీ వైపు: ఈ మార్గంలో వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి మీదుగా మళ్లిస్తారు.

బషీర్‌బాగ్ నుండి సచివాలయం: అంబేడ్కర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం ఉత్తమం.

లిబర్టీ నుండి అంబేడ్కర్ జంక్షన్: ఈ ట్రాఫిక్‌ను బీఆర్‌కే భవన్ లేన్ మీదుగా మళ్లిస్తారు.

అప్పర్ ట్యాంక్ బండ్ నుండి లిబర్టీ: ట్యాంక్ బండ్ మీదుగా వచ్చే వాహనాలను అంబేడ్కర్ విగ్రహం వద్ద మళ్లిస్తారు.

ఆర్టీసీ బస్సుల మళ్లింపు:

సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 113, 6, 83, 72, 8A వంటి ప్రధాన రూట్లలో నడిచే ఆర్టీసీ బస్సులను పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నారు.

ఈ రూట్లలో వెళ్లకండి

ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే ఈ క్రింది ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు:

  • అంబేద్కర్ జంక్షన్
  • సెక్రటేరియట్ పరిసరాలు
  • ఇక్బాల్ మినార్
  • నెక్లెస్ రోటరీ
  • ఎన్టీఆర్ మార్గ్

వాహనదారులకు సూచనలు

వేడుకల దృష్ట్యా ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్ పరిసరాల్లో భారీగా జనం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని మరియు మార్గాలను ముందే ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *