మీరనుకుంటున్నట్టు నేను కాదు.. జబర్దస్త్‌లో రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన శాంతి స్వరూప్

మీరనుకుంటున్నట్టు నేను కాదు.. జబర్దస్త్‌లో రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన శాంతి స్వరూప్


మీరనుకుంటున్నట్టు నేను కాదు.. జబర్దస్త్‌లో రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన శాంతి స్వరూప్

జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు. ఎంతో మంది కమెడియన్స్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే కొంతమంది లేడీ గెటప్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో శాంతి స్వరూప్ ఒకరు. శాంతి స్వరూప్ ఎక్కువగా లేడీ గెటప్ ద్వారా పాపులర్ అయ్యాడు. కాగా ఓ ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్ అనేక విషయాలను వెల్లడించారు. తన స్కిట్ లకు లక్షల్లో పారితోషికం వస్తుందని వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. బయట ప్రజలు తనను కూరగాయల మార్కెట్లలో కూడా ఇదే విషయంపై ప్రశ్నిస్తుంటారని, ఇది విన్నప్పుడు కోపం వస్తుందని అన్నారు. టీమ్ లీడర్లకే అంత రెమ్యునరేషన్ ఉండదని, ఒక టీమ్ లో పది మంది ఉంటే, వచ్చిన మొత్తాన్ని వారందరికీ పంచుకోవాల్సి ఉంటుందని వివరించాడు. జబర్దస్త్ లోని రెమ్యునరేషన్ సరిపోయేంతగా ఉంటుందని, కానీ లక్షల్లోనో, వేలల్లోనో ఉండదని స్పష్టం చేశారు. షోల కంటే ఈవెంట్లు, ఇతర ప్రదర్శనల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

జబర్దస్త్ లో ఎవరికైనా రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుందని శాంతి స్వరూప్ తెలియజేశారు. ఒక స్కిట్ లో ఎవరు పాల్గొంటే వారికే ఆ ఎపిసోడ్ కు సంబంధించిన మొత్తం చెల్లిస్తారని, టీమ్ లో ఉన్నప్పటికీ స్కిట్ చేయని వారికి పారితోషికం ఉండదని ఆయన వివరించాడు. కొందరు టీమ్ లీడర్లు స్కిట్ లో లేని వారికి కూడా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. హైపర్ ఆది, అవినాష్ వంటి కొందరు టీమ్ లీడర్లు మాత్రమే అతిథి పాత్రలకు నిజాయితీగా డబ్బులు ఇస్తారని, మిగతా అందరూ ఇవ్వరని శాంతి స్వరూప్ తెలిపారు. స్కిట్లు రాయడం విషయానికి వస్తే, హైపర్ ఆది తన స్కిట్లను తానే రాసుకుంటారని, అవినాష్ కూడా కొన్నిసార్లు లైన్లు అందిస్తారని చెప్పారు. రైటర్లు సాధారణంగా ఒక టీమ్ కు కాకుండా అనేక టీమ్ లకు పనిచేస్తారని, కొందరు టీమ్ లీడర్లు (సుధీర్, అభి వంటి వారు) తమ రైటర్లను కలిగి ఉంటారని తెలిపారు.

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

అలాగే తన గురించి వెనక మాట్లాడడం, రాజకీయం చేయడం తనకు నచ్చదని, నచ్చని విషయాలను ముఖం మీదే చెబుతానని అన్నారు. చివరగా, లేడీ గెటప్‌లపై వస్తున్న అభ్యంతరకర వ్యాఖ్యలను శాంతి స్వరూప్ తీవ్రంగా ఖండించారు. తాను ట్రాప్ చేస్తానని, నైట్స్ బుక్ చేస్తానని వస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొట్టారు. మేము జెంట్స్ అని ప్రపంచానికి తెలుసు, చూసే జనాలకు తెలుసు. మేము క్యారెక్టర్లు మాత్రమే చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. షూటింగ్ అయిపోగానే మేకప్ తీసేసి వెళ్లిపోతామని, రోడ్లపై మేకప్‌తో కనిపించబోమని తెలియజేశారు. కించపరిచేలా మాట్లాడేవారికి, తమ కష్టం తెలియదని, తాము నిజాయితీగా శ్రమిస్తున్నామని, ఎవరి మీదా ఆధారపడకుండా బతుకుతున్నామని ఆయన తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *