Headlines

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా


Yash: ఏక్ విలన్.. యశ్ ప్లానింగ్ అదిరింది కదా

టాక్సిక్‌లో హీరో కంటే రామాయణలో తాను చేస్తున్న విలన్ పాత్రకే యశ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా..? తన కెరీర్లో రావణుడి పాత్ర ఒక మైల్ స్టోన్ అవుతుందని బలంగా నమ్ముతున్నారా..? అందుకే హీరోగా చేస్తున్న సినిమా కంటే నెగిటివ్ రోల్‌నే ఇంటర్నేషనల్ స్టేజ్‌‌పై ప్రమోట్ చేస్తున్నారా..? టాక్సిక్‌ను కాదని రామాయణను యశ్ అంత భారీగా ప్రమోట్ చేయడానికి కారణమేంటి..? కేజియఫ్ 2 వచ్చి నాలుగేళ్లవుతున్నా.. రాకింగ్ స్టార్ యశ్ మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు. దానికి కారణం ఒకేసారి రెండు సినిమాలతో తక్కువ గ్యాప్‌లో రానుండటమే. టాక్సిక్‌తో పాటు మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమాలోనూ ఈయన రావణుడిగా నటిస్తున్నారు. పైగా దీనికి యశ్ కో ప్రొడ్యూసర్ కూడా..! వీటిలో జూన్ 4న టాక్సిక్ విడుదల కానుండగా.. దివాళి 2026కి రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్ ఈ మధ్య లాస్ వేగాస్ వెళ్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో అది టాక్సిక్ సినిమా కోసమే అనుకున్నారంతా.. కానీ అసలు కారణం టాక్సిక్‌తో పాటు రామాయణ ప్రమోషన్స్ కోసం. డైరెక్టర్ నితేష్ తివారీతో కలిసి ఏప్రిల్ 13 నుంచి 16 వరకు లాస్ వేగాస్‌లో జరగబోయే సినిమాకాన్ 2026లో రామాయణ చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేయనున్నారు యశ్. రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణ సినిమాకు ఏఆర్ రెహమాన్‌తో పాటు హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. టాక్సిక్ కంటే రామాయణనే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు యశ్. హీరో కంటే విలన్ పాత్రే తనకు ఎంతో స్పెషల్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు యశ్. మరి చూడాలిక.. రాకింగ్ స్టార్ నమ్మకాన్ని రావణుడి పాత్ర ఎంతవరకు నిలబెడుతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చరణ్, బన్నీ, తారక్ మధ్య వార్.. కారణం అతడే

దేవుడి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో టాలీవుడ్ భామలు

ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్‌లు

ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు

హ‌ర్మూజ్‌లో తానే పెట్టిన సముద్ర మైన్‌లు.. వెతకలేక ఇరాన్ తంటాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *