Video: చాహల్ గుట్టు రట్టు చేసిన హాట్ బ్యూటీ.. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్..

Video: చాహల్ గుట్టు రట్టు చేసిన హాట్ బ్యూటీ.. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్..


Video: చాహల్ గుట్టు రట్టు చేసిన హాట్ బ్యూటీ.. ఆ వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్..

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. మైదానంలో వికెట్లతో మ్యాజిక్ చేసే ఈ ఆటగాడు.. ఈసారి సోషల్ మీడియా వేదికగా ఒక నటితో జరిపిన చాటింగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. గాంధీ బాత్ ఫేమ్ నటి తాన్యా ఛటర్జీ తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పుడు ఐపీఎల్ సీజన్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఒక పాపరాజీ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాన్యా ఛటర్జీ, చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్‌లు పంపారని బాంబు పేల్చింది. చాహల్ తన సొంత వీడియోలను ఆమెకు డైరెక్ట్ మెసేజ్ చేయడమే కాకుండా తనను క్యూట్ అని అన్నట్లు వెల్లడించింది. ‘‘అతను నాకు వ్యక్తిగతంగా తెలియదు, అలాంటి వ్యక్తి నుండి ఇలాంటి మెసేజ్‌లు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అంటూ ఆమె తన ఫోన్‌లోని చాట్‌ను కెమెరాకు చూపించింది.

వైరల్ అవుతున్న చాట్ స్క్రీన్‌షాట్లు

తాన్యా చూపించిన వీడియోలో చాహల్ తన పాత వీడియోలను కొన్నింటిని ఆమెకు షేర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఆమె కావాలనే పబ్లిసిటీ కోసం ఈ విషయాన్ని రచ్చ చేస్తోందా లేక చాహల్ నిజంగానే పరిధులు దాటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ‘‘ఇదంతా పబ్లిసిటీ స్టంట్.. చాహల్ ఒక వీడియో పంపితే దాన్ని ఇంత రచ్చ చేయాలా?’’ అని అతడి ఫ్యాన్స్ తాన్యాను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం నటీమణులకు ఇలాంటి మెసేజ్‌లు పంపడం ఏంటి?” అంటూ చాహల్‌ను విమర్శిస్తున్నారు.

మౌనంగానే చాహల్..

గతంలో కూడా పలువురు హీరోయిన్లతో చాహల్ పేరు ముడిపడినప్పటికీ, ఈ తాజా వివాదంపై ఆయన ఇంకా స్పందించలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల బిజీలో ఉన్న చాహల్, ఈ ఇష్యూను లైట్ తీసుకుంటారా లేక గట్టి కౌంటర్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Bollywood ADDA (@bollywood_adda_official)





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *