Jos Buttler : టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్.. అర్ధశతకాలలో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ స్టార్

Jos Buttler : టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్..  అర్ధశతకాలలో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ స్టార్


Jos Buttler : టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్..  అర్ధశతకాలలో సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ స్టార్

Jos Buttler : లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో జోస్ బట్లర్ కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత బట్లర్ మాట్లాడుతూ.. పరుగుల వేటలోకి తిరిగి రావడం చాలా ఉపశమనాన్ని ఇచ్చిందని తెలిపారు. గత కొన్ని నెలలుగా తన ఫామ్ ఆందోళన కలిగించిందని, అయితే సరైన సమయంలో రాణించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న అరుదైన మైలురాయిని కూడా ఆయన అధిగమించారు.

తన వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషిస్తూ.. కొద్ది రోజులు క్రికెట్‌కు దూరంగా ఉండటం తనకు మేలు చేసిందని బట్లర్ చెప్పారు. ఆ విరామం తన టెక్నిక్, మానసిక స్థితిని సరిచేసుకోవడానికి ఉపయోగపడిందని అన్నారు. “నేను గత కొన్ని వారాలుగా నా సెటప్, బేసిక్స్‌పై మాత్రమే దృష్టి పెట్టాను. కొన్ని సాంకేతిక లోపాల వల్ల బంతిని సరిగ్గా ట్రాక్ చేయలేకపోయాను. బంతిని సరిగ్గా చూడలేకపోతే ఈ ఆట చాలా కష్టమవుతుంది. అందుకే బంతి విసరకముందు నా పొజిషన్ ఎలా ఉందో గమనించి, మళ్లీ పాత ఫామ్ అందుకున్నాను” అని బట్లర్ వివరించారు.

తన రీ ఎంట్రీలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ పాత్ర చాలా ఉందని బట్లర్ కొనియాడారు. “ప్రాక్టీస్ సెషన్లలో హేడెన్ నన్ను అడిగిన ఒకే ఒక ప్రశ్న నాలో ఆలోచన రేకెత్తించింది. నువ్వు బంతిని ఎంత బాగా చూస్తున్నావు? నువ్వు బంతిని ట్రాక్ చేయలేకపోతున్నావా? అని ఆయన అడిగారు. ఆయనలాంటి గొప్ప ఆటగాళ్లు చాలా చిన్న సలహాలు ఇస్తారు, కానీ అవి అద్భుతంగా పని చేస్తాయి. ఆయన మాటలు విన్న తర్వాత నేను బంతిపై మరింత దృష్టి పెట్టాను. 15 ఏళ్ల అనుభవం ఉన్న నాకు మైదానంలోకి దిగితే ఏం చేయాలో తెలుసు, కానీ ఆ చిన్న లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఆయన సాయం చేశారు” అని బట్లర్ తెలిపారు.

ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో బట్లర్ వంటి ఆటగాడు ఫామ్‌లోకి రావడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ప్లస్ పాయింట్. ఓపెనింగ్‌లో బట్లర్ ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టుకు కొండంత బలాన్నిస్తాయి. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తానని బట్లర్ ధీమా వ్యక్తం చేశారు. లక్నోపై సాధించిన ఈ విజయం టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, హేడెన్ వంటి దిగ్గజాల సలహాలు జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా ఎంతో స్ఫూర్తినిస్తాయని ఆయన ముగించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *