పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి


పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎం మెషిన్‌నే పెకలించుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అది కూడా పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం పోలీసులకే సవాల్‌గా మారింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్‌బీఐ ఏటీఎంను దొంగలు తమ లక్ష్యంగా చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఏటీఎంలోకి చొరబడిన దుండగులు, గ్యాస్ కట్టర్లతో మెషిన్‌ను కట్ చేశారు. అనంతరం ఆ భారీ ఏటీఎం మెషిన్‌ను ఒక వాహనంలో వేసుకుని అక్కడి నుంచి మాయమయ్యారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్నప్పటికీ, దొంగలు ఎంత పక్కా ప్లాన్‌తో వచ్చారంటే.. వారు వెళ్లే వరకు ఎవరికీ అనుమానం రాలేదు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బి గితే స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. డీఎస్పీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో జిల్లా సరిహద్దుల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ మెషిన్‌లో ఎంత నగదు ఉందనే విషయాన్ని అధికారులు లెక్కిస్తున్నారు. ఈ సాహసోపేతమైన చోరీ వెనుక అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

UPI Rules 2026: RBI కొత్త ప్రతిపాదన.. UPI పేమెంట్లలో గంట ఆగాల్సిందే

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

చిన్నారుల రక్తపు మరకల.. బ్యాగులతో చర్చలు

మహిళా పోలీసుల అండర్‌ కవర్‌ ఆపరేషన్‌.. ఆరుగురు అరెస్ట్‌

భర్త నల్లగా ఉన్నాడని భార్య దారుణం.. ఆస్కార్ లెవెల్‌ యాక్టింగ్‌తో డ్రామా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *