ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్


ముమ్మాటికీ ఇది దాడే !! నిప్పులు చెరిగిన కమల్ హాసన్

విజయ్‌ దళపతి నటించిన జననాయగన్ సినిమా నెట్టింట లీక్ అవ్వడం పై కోలీవుడ్‌లో సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరిగా రియాక్టవుతున్నారు. జననాయగన్‌కు మద్దతుగా తమ గళం వినిపిస్తున్నారు. తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఇదే చేశారు. విజయ్‌కు మద్దతుగా మాట్లాడడమే కాదు.. తీవ్రంగా కూడా రియాక్టయ్యారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో సకాలంలో రిలీజ్‌ అవలేదని, ఈ కారణం వల్లే పైరసీకి అవకాశం ఏర్పడిందని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఇది కళ, కళాకారుడిపై జరిగిన దాడి అంటూ కమల్ అభివర్ణించారు. ఇలాంటి చర్యలు వందలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు, థియేటర్‌ ఓనర్లు, నిర్మాతలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. వ్యవస్థ విఫలమైనప్పుడు సినిమాను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. సినీ ప్రియులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి పైరసీ చేసేవాళ్లకు గట్టి సమాధానమివ్వాలని కోరారు. గతంలో తనకు మద్దతుగా నిలబడినట్లే జననాయగణ్‌ సినిమాకు సైతం అంతే అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అటవీ మార్గంలో బస్సు పై దాడి.. ప్రయాణికుల హాహాకారాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *