ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..

ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..


ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..

చాలా మంది తరచుగా ఆయాసం గురించి ఫిర్యాదు చేస్తుంటారు. దీనిని ఎప్పుడూ.. నిర్లక్ష్యం చేయకూడదు.. ఎందుకంటే ఇది అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు. ఆయాసానికి అధిక శ్రమ, శారీరక బలహీనత, ఊబకాయం, ఒత్తిడి లేదా ఆందోళన వంటి అనేక సాధారణ కారణాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం, దుమ్ము లేదా అలర్జీలు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దోహదం చేస్తాయి.

కొన్నిసార్లు, ఎక్కువసేపు కూర్చోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల శరీర శక్తి తగ్గి, తేలికపాటి పనులు చేసినా కూడా ఆయాసం వస్తుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం.. ధూమపానం వంటి అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ సమస్య తరచుగా వస్తుంటే లేదా ఎలాంటి శ్రమ లేకుండా కూడా ఇలా అనిపిస్తే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఆయాసం ఏయే వ్యాధులను సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది?

లేడీ హార్డింగ్ హాస్పిటల్‌లోని వైద్య విభాగం డైరెక్టర్ – హెచ్‌ఓడి అయిన డాక్టర్ ఎల్.హెచ్. ఘోటేకర్.. తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేక తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం కావచ్చని వివరిస్తున్నారు. ఈ సమస్య ఆస్తమా, బ్రాంకైటిస్ లేదా ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను సూచించవచ్చు. గుండె వైఫల్యం లేదా గుండెలో అడ్డంకులు వంటి గుండె సమస్యలు కూడా శ్వాస సమస్యలకు కారణం కావచ్చు.

రక్తహీనత శరీరంలో ఆక్సిజన్ కొరతకు కారణమవుతుంది.. దీనివల్ల ఆయాసం వస్తుంది. కొన్ని సందర్భాల్లో, థైరాయిడ్ అసమతుల్యతలు లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కూడా దీనికి కారణం కావచ్చు. ఆయాసంతో పాటు ఛాతీ నొప్పి, తల తిరగడం లేదా అలసట వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది?

వృద్ధులు – శారీరక సామర్థ్యాలు తగ్గిన వారి వంటి కొంతమందికి ఆయాసం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ధూమపానం చేసేవారు లేదా కలుషిత వాతావరణంలో నివసించేవారికి కూడా ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది.

ఊబకాయం ఉన్నవారిలో, చురుకైన జీవనశైలి లేనివారిలో కూడా ఆయాసం ఎక్కువగా కనిపిస్తుంది. ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి.

దీన్ని ఎలా నివారించాలి?

ఆయాసాన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా అవసరం. క్రమం తప్పని వ్యాయామం ఊపిరితిత్తులను బలపరుస్తుంది – శక్తిని పెంచుతుంది. సమతుల్య ఆహారం తీసుకోండి. ధూమపానానికి దూరంగా ఉండండి.

కాలుష్యాన్ని నివారించడానికి మాస్క్ ధరించండి. మంచి పరిశుభ్రతను పాటించండి. అలాగే, మీ శరీరంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయవద్దు.. మీ వైద్యుడితో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *