IPL 2026 : సిఎస్‌కె కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా.. గ్రౌండ్లోకి దిగకుండానే నితీష్ రాణా పై వేటు.. ఎందుకంటే ?

IPL 2026  : సిఎస్‌కె కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా.. గ్రౌండ్లోకి దిగకుండానే నితీష్ రాణా పై వేటు.. ఎందుకంటే ?


IPL 2026  : సిఎస్‌కె కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా.. గ్రౌండ్లోకి దిగకుండానే నితీష్ రాణా పై వేటు.. ఎందుకంటే ?

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడంతో (Slow Over Rate), ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో సిఎస్‌కె చేసిన మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్‌పై మాత్రమే ఈ జరిమానా పడింది. ఒకవేళ ఇదే తప్పు మళ్ళీ జరిగితే జరిమానా మొత్తం పెరగడమే కాకుండా మిగిలిన ఆటగాళ్లపై కూడా ప్రభావం పడుతుంది.

ఐపీఎల్ 2026లో స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్ష అనుభవించిన రెండో కెప్టెన్ రుతురాజ్. అంతకుముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా రెండుసార్లు ఈ తప్పు చేసి జరిమానాలు కట్టాడు. గుజరాత్ టైటాన్స్, సిఎస్‌కెపై జరిగిన మ్యాచుల్లో పంజాబ్ జట్టు ఓవర్ల వేగాన్ని నియంత్రించలేకపోయింది. ఇప్పుడు రుతురాజ్ కూడా అదే జాబితాలోకి చేరాడు.

ఈ మ్యాచ్‌లో అత్యంత విచిత్రమైన విషయం నితీష్ రాణాకు విధించిన జరిమానా. నితీష్ రాణా ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ జాబితాలో ఉన్నాడు కానీ, బ్యాటింగ్ చేయడానికి లేదా ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. అయితే, డ్రెస్సింగ్ రూమ్ సమీపంలో ఉండి ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అంతేకాకుండా, అతని ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు.

అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

సిఎస్‌కె ఇన్నింగ్స్ 19వ ఓవర్ సమయంలో ఈ గొడవ జరిగింది. ఢిల్లీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ తన గ్లోవ్స్ మార్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఫోర్త్ అంపైర్ దానికి అనుమతించలేదు. అదే ఓవర్లో స్టబ్స్ అవుట్ అవ్వడంతో ఢిల్లీ క్యాంప్ ఆగ్రహానికి గురైంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉన్న నితీష్ రాణా, కోచ్‌తో కలిసి ఫోర్త్ అంపైర్ వద్దకు వెళ్లి గట్టిగా వాదించాడు. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ గట్టిగా అరవడంతో, అది ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చింది. ఫలితంగా ఆడకుండానే నితీష్ రాణా భారీ జరిమానా కట్టాల్సి వచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *