TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ 2026 ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ 2026 ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే


TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ 2026 ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

హైదరాబాద్‌, ఏప్రిల్ 12: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 రాసిన విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఇంటర్‌ పరీక్షల ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్‌ ఫలితలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ కింది టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌ లింక్‌లో తమ హాల్‌ టికెట్ నంబర్‌ నమోదు చేసి రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్టుల వారీగా మార్కుల వివరాలను కూడా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. ఇక తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో అమ్మాయిలు గరిష్ఠ మార్కులతో అధిక ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026 ఇక్కడ చెక్ చేసుకోండి.

కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,97,075 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు 4,89,126 మంది, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులు 5,07,949 మంది ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. మార్చి 30వ తేదీతో మూల్యాంకనం కూడా చకచకా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలోనే ఫలితాలు వెల్లడిస్తామని అధికా రులు మొదట్లో ప్రకటించినప్పటికీ బడ్జెట్‌ సమావేశాల కారణంగా కొంత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ఇక మే నెలాఖరు నాటికి సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించి ఫలితాలను వెల్లడించాలని ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలు వెల్లడించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. అయితే ఈసారి ఇంటర్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని భావించిన ఇంటర్ బోర్డు ముందుగా ప్రకటించిన మాదిరిగానే ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించింది. ఈ మేరకు తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ రెండో వారంలోనే ఇంటర్ ఫలితాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *