Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే చాలు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్..

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే చాలు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్..


Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే చాలు బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్..

ఐపీఎల్ 2026లో యువ కెరటం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన 16వ మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు కొట్టి తన టీమ్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ఈ బీహార్ కుర్రాడి సంపాదనపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్‌ ఒక్కో మ్యాచ్‌కు రూ. 15 లక్షలకు పైగా వెనకేసుకుంటున్నాడు.

లెక్కలు ఇలా

కాంట్రాక్ట్ వాటా: లీగ్ దశలోని 14 మ్యాచ్‌లకు అతని ఒప్పందాన్ని లెక్కిస్తే ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ. 7.85 లక్షలు వస్తుంది.

మ్యాచ్ ఫీజు: ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఆడే ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ. 7.50 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది.

మొత్తం ఆదాయం: ఈ రెండింటినీ కలిపితే, వైభవ్ ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ. 15.35 లక్షలు సంపాదిస్తున్నాడు.

ఇది కాకుండా మ్యాచ్‌లో అతను గెలుచుకునే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ఇతర అవార్డుల రూపంలో వచ్చే నగదు బహుమతులు అదనం.

పొలం నుండి ఐపీఎల్ పిచ్ వరకు..

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తాజ్‌పూర్ అనే చిన్న గ్రామానికి చెందిన వైభవ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అతను, తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రోత్సాహంతో నాలుగేళ్ల ప్రాయంలోనే బ్యాట్ పట్టాడు. క్రికెట్ శిక్షణ కోసం గ్రామం నుండి పాట్నా, ముజఫర్‌పూర్ వంటి నగరాలకు నిత్యం ప్రయాణించేవాడు. అతని కష్టానికి ప్రతిఫలమే నేడు ఐపీఎల్ వేదికపై కనిపిస్తున్న మెరుపులు. క్షణాల్లో మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యం ఉన్న వైభవ్, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారుతున్నాడని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *