
Chennai Super Kings vs Delhi Capitals, 18th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రోజులో రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరియు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య జరగనుంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ రెండు మార్పులు చేసింది. నితీష్ రాణా, విప్రజ్ నిగమ్‌ల స్థానంలో ఆకిబ్ నబీ, అశుతోష్ శర్మ జట్టులోకి వచ్చారు. మరోవైపు, చెన్నై ఇద్దరు ఆటగాళ్లను తీసుకువచ్చింది. గుర్జప్‌నీత్ సింగ్, డెవాల్డ్ బ్రెవిస్ నేటి మ్యాచ్ ఆడుతున్నారు.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లేకుండా సీఎస్కే ఈరోజు ఆడనుంది. డెవాల్డ్ బ్రెవిస్ ఈరోజు ఖచ్చితంగా ఆడుతున్నాడు. ఆ జట్టు మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది. మరోవైపు, అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లు గెలిచింది, ఆ జట్టు గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమిని చవిచూసింది.