ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం


ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం చిత్ర విచిత్రంగా మారుతోంది. జనం భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, మరోవైపు పిడుగులతో కూడిన అకాల వర్షాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. విపత్తుల నిర్వహణ సంస్థ గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌ 11 శనివారం రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 79 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది. విజయనగరం లో 20 మండలాలు, పార్వతీపురం మన్యం లో 14 మండలాలు, శ్రీకాకుళంలో 8, అల్లూరి సీతారామరాజు , పోలవరంలో 6, అనకాపల్లి లో 5, కాకినాడ 2, తూర్పుగోదావరి 4, ఏలూరు 3, ఎన్టీఆర్ 3 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం వుందని, జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప మధ్యాహ్నం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు తెలంగాణ, రాయలసీమ , తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *