Tollywood: మిమ్మల్ని పీకినొక్కి చంపేయాలని ఉంది.! చంద్రమోహన్ ఈ మాట అనడంతో నవ్వుతూ ఏం చెప్పానంటే..

Tollywood: మిమ్మల్ని పీకినొక్కి చంపేయాలని ఉంది.! చంద్రమోహన్ ఈ మాట అనడంతో నవ్వుతూ ఏం చెప్పానంటే..


Tollywood: మిమ్మల్ని పీకినొక్కి చంపేయాలని ఉంది.! చంద్రమోహన్ ఈ మాట అనడంతో నవ్వుతూ ఏం చెప్పానంటే..

టాలీవుడ్ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన విలక్షణ నటన, విలన్ పాత్రల వెనుక ఉన్న ఆసక్తికర రహస్యాలను గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రధానంగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రం ద్వారా ఆయన నటుడిగా ఎలా స్థిరపడ్డారో వివరించారు. సాధారణంగా విలన్ అంటే గంభీరమైన కంఠం, భారీ శరీరం ఉండాలని అప్పట్లో భావించేవారు. కానీ, గొల్లపూడి తన శారీరక పరిమితులను గమనించి, ఒక కొత్త తరహా విలనిజానికి తెరలేపారు. “మంచితనం ముసుగులో ఉండే దుర్మార్గుడి” పాత్రను ఆయన సృష్టించారు. పైకి పెద్ద మనిషిలా కనిపిస్తూనే, లోలోపల కుతంత్రాలు చేసే ఈ తరహ విలనిజాన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనినే ఆయన “ఇంటెలెక్చువల్ ఇంప్రవైజేషన్” అని పిలిచారు. సుమారు 280 సినిమాల్లో ఆయన ఇలాంటి విలక్షణ పాత్రలతో మెప్పించారు.

ఇది చదవండి: SPB నన్ను చూసి భయపడేవాడు.! అది ఆయన ఫీలింగ్.. కానీ అవకాశాలు రాకపోవడానికి కారణం..

‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ మూవీలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. మొదట ఈ పాత్రను మరొకరి కోసం రాశారని గొల్లపూడి తెలిపారు. అయితే తాను నటించాల్సి వచ్చినప్పుడు, తనదైన శైలిలో మెత్తని దురుసుతనం జోడించి ఆ పాత్రను మార్చుకున్నారు. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రం 515 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇంటర్వెల్ సమయానికే తాను స్టార్‌గా మారిపోయానని, కడపలో సినిమా చూస్తున్నప్పుడు జనం తనను చుట్టుముట్టడంతో తన పాపులారిటీ అర్థమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. అటు నటుడు చంద్రమోహన్‌తో తనకున్న అనుబంధాన్ని గొల్లపూడి సరదాగా పంచుకున్నారు. ఒక సందర్భంలో చంద్రమోహన్ “మిమ్మల్ని పీకనొక్కి చంపేయాలని ఉంది” అని తన నటనను ఉద్దేశించి అన్నారని, దానికి తాను అంతే హాస్యంగా బదులిచ్చానని చెప్పారు. వీరిద్దరి మధ్య ఉన్న ఇలాంటి సరదా మాటలు వారి మధ్య ఉన్న గాఢమైన స్నేహానికి, వృత్తిపరమైన గౌరవానికి నిదర్శనం. తన విలక్షణ నటనను ప్రోత్సహించిన కోడి రామకృష్ణ లాంటి దర్శకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇది చదవండి: మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే.. అప్పుడే చెప్పిన గొల్లపూడి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *