Cleaning Tips: ఇంటి గోడలను పిల్లలు గీతలతో నింపేశారా? ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో క్లీన్ చేయండి

Cleaning Tips: ఇంటి గోడలను పిల్లలు గీతలతో నింపేశారా? ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో క్లీన్ చేయండి


Cleaning Tips: ఇంటి గోడలను పిల్లలు గీతలతో నింపేశారా? ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో క్లీన్ చేయండి

ఇంట్లో గోడలపై పిల్లలు గీసిన క్రయన్స్ గీతలను తొలగించడానికి పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే టూత్‌పేస్ట్ చాటా బాగా పనిచేస్తుంది. ఇది కేవలం నోటి ఆరోగ్యానికే కాకుండా, ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇందులో ఉండే స్వల్ప ఘర్షణ గుణం శుభ్రపరిచే పదార్థాలు కలిసి మొండి మరకలను, మురికిని సులభంగా తొలగిస్తుంది. కాబట్టి టూత్‌పేస్ట్‌తో కొన్ని వస్తువులను కలిపి మీరు ఈజీగా మరకలను తొలగించవ్చ.

గోడలపై క్రేయాన్ మరకలు ఇలా తొలగించండి

పిల్లలు గోడలపై క్రేయాన్స్‌తో గీసిన గీతలను తొలగించడానికి టూత్‌పేస్ట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సర్ఫ్యాక్టెంట్స్ అనే రసాయనాలు మైనపు మరకలను విచ్ఛిన్నం చేసి సులభంగా తొలగిస్తాయి. అలాగే, ఇందులోని స్వల్ప ఘర్షణ గుణం వల్ల పెయింట్‌కు హాని కలగకుండా రంగులు పోతాయి. ఇందుకోసం మీరు క్రేయాన్ మరకలు ఉన్న చోట నేరుగా టూత్‌పేస్ట్ రాయండి. తర్వాత తడి గుడ్డతో మెల్లగా తుడిచేయండి. అంతే క్షణాల్లో మరకలు మాయమవుతాయి. ఈ చిట్కా పెయింట్ వేసిన గోడలపై చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

బాత్‌రూమ్ అద్దంపై నీటి మరకలు

బాత్‌రూమ్ అద్దంపై పేరుకుపోయిన గట్టి నీటి చుక్కల మరకలను తొలగించడానికి కూడా టూత్‌పేస్ట్ ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే మెత్తని కణాలు అద్దానికి నష్టం కలిగించకుండా నీటి మరకలను మాత్రమే క్లీన్ చేస్తాయి. నీటి మరకలు ఉన్న చోట కొద్దిగా టూత్‌పేస్ట్ రాసి ఒక మెత్తని గుడ్డతో మెల్లగా రుద్దాలి. తర్వాత తడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి. అంతే అద్దంపై ఉన్న మరకలు క్షణాల్లో మాయమవుతాయి.

ఏ పేస్ట్ వాడాలి

పైన పేర్కొన్న వస్తువులను శుభ్రపరచడానికి సాదా తెల్లని టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఉపయోగించాలి. చార్‌కోల్, జెల్ లేదా ఏ రంగు టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *