RBI: ఆర్బీఐ కొత్త రూల్స్.. విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి పెద్ద ఊరట.. ఇకపై..

RBI: ఆర్బీఐ కొత్త రూల్స్.. విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి పెద్ద ఊరట.. ఇకపై..


RBI: ఆర్బీఐ కొత్త రూల్స్.. విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి పెద్ద ఊరట.. ఇకపై..

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి పంపే డబ్బులపై ఊరట కలిగించింది. ఇప్పటివరకు విదేశాల నుంచి ఇండియాకు డబ్బులు పంపితే… అవి అకౌంట్లోకి రావాలంటే రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టేంది. అయితే ఇక నుంచి విదేశీ లావాదేవీల్లో వేగం పెరగనుంది. నిధుల బదిలీలో జాప్యం తగ్గించడంతో పాటు పారదర్శకత, సౌలభ్యం తెచ్చేలా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఉన్న రూల్స్‌లో మార్పులు చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి భారత్‌కు డబ్బులు పంపితే.. అదే రోజు అకౌంట్లో పడనున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారత చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం, వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఒకే రోజులో అకౌంట్లోకి

ఇప్పటివరకు విదేశాల నుంచి డబ్బులు పంపితే కుటుంబసభ్యుల అకౌంట్లో పడటానికి రెండే లేదా మూడు రోజుల సమయం పట్టేది. దీని వల్ల డబ్బులు అత్యవసరమైనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించి విదేశీ చెల్లింపులను వేగవంతం చేయడానికి కొత్త నిబంధలను ఆర్బీఐ రూపొందించింది. ఈ నియమాల ప్రకారం ఇక నుంచి విదేశీ మారక ద్రవ్య మార్కెట్ పనివేళల్లో ఒక బ్యాంకుకు విదేశాల నుంచి డబ్బు పంపిస్తే.. అదే రోజున జమ చేయాలి. ఒక మార్కెట్ సమయం తర్వాత వస్తే తర్వాతి రోజు అకౌంట్లో వేయాలి. పెమా నిబంధనలను అనుగుణంగా ఈ లావాదేవీలు జరుగుతాయి. ఇక డబ్బు జమ గురించి వినియోగదారులకు తక్షణమే సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంకింగ్ పనివేళల తర్వాత అయితే మరుసటి రోజు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల వినియోగదారులకు స్పష్టమైన అవగాహన ఉంటుంది.

ఆటోమేటెడ్ సిస్టమ్ విధానం

ఇక నిధులు వేగంగా జమ అయ్యేలా చేసేందుకు రియల్ టైమ్‌లో లేదా అరగంటకు ఒక్కసారైనా ప్రక్రియను అప్డేట్ చేయాలి. ఇక వినియోగదారులు తమ లావాదేవీలను ట్రాక్ చేసేందకు, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందించాలి. సిబ్బంది ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ అయ్యేలా ఆటోమేటెడ్ వ్యవస్థను రూపొందించాలి. దీని ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా పొరపాట్లు కూడా జరగవు. ఆరు నెలల్లో ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు దీనికి అనుగుణంగా మార్పులు చేసేకునేందుకు ఆర్బీఐ సమయమిచ్చింది. చెల్లింపు, పరిష్కారాల వ్యవస్థల చట్టం 2007 క్రింద ఈ నిబంధణలు జారీ చేశారు. ఇవి త్వరలో అమల్లోకి రానన్నాయి. దీంతో విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి, అందుకునేవారికి ఊరట లభించనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *