Ustaad Bhagat Singh : ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..

Ustaad Bhagat Singh : ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..


Ustaad Bhagat Singh : ఓటీటీలోకి ఉస్తాద్ భగత్ సింగ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడొచ్చంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలయ్యాక ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన నటనతో అలరించారు పవన్. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 16 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. చాలా రోజులుగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Mrunal Thakur : అతడే నా లక్కీ ఛార్మ్.. అతడు లేకపోతే నేను లేను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు ఫ్యాన్స్. చాలా రోజులుగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Sekhar Kammula : ఆ సినిమా రిజల్ట్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యాను.. 6 నెలలు బాధపడ్డాను.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కామెంట్స్..

కథ విషయానికి వస్తే.. నల్లమల్లకు సమీపంలోని ఓ గూడెంలో పాఠాలు చెప్పే చంద్రశేఖర్ రావు (కె.ఎస్.రవికుమార్) అనే మాస్టారు తన జీవితాన్ని ఆ జనం కోసం అంకితం చేస్తాడు. కూలీ పనులకు వెళ్లే పిల్లలు మళ్లీ బడికి వచ్చేలా చేస్తాడు. అదే గ్రామంలోని చిన్నయ్య అనే కుర్రాడి ఆలోచనలు.. అతడిలోని ఆవేశం గ్రహించి అతడికి భగత్ సింగ్ అని పేరు పెట్టి పాఠాలు చెబుతాడు. అయితే తన తండ్రిని ఉస్తాద్ అని పిలిచేవారని.. దీంతో తన పేరును ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకుంటాడు ఆ కుర్రాడు. తనకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన చంద్రశేఖర్ మాస్టారు రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో.. ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) అతడికి ఎప్పుడూ రక్షణగా ఉంటాడు. ప్రతి సంఘటనను ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ? తన జీవితంలోకి లీల(శ్రీలీల), శ్లోక (రాశీ ఖన్నా) ఎలా వచ్చారు.. ? అనేది కథ.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్‏తో మాత్రమే నా బాధలను చెప్పుకుంటాను.. అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Trisha Krishnan : సినిమాలకు త్రిష గుడ్ బై.. వ్యాపారవేత్తతో పెళ్లి.. స్పందించిన హీరోయిన్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *