పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు

పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు


పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఏటీఎం మెషిన్‌ను పూర్తిగా ఎత్తుకెళ్లడం.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న ఎస్బిఐ ఏటీఎంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఏటీఎం మెషిన్‌ను వాహనంలో లోడ్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంటనే డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో డి.ఎస్.పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పోలీసులు అన్ని వాహనాలను చెక్ చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ తరహా చోరీ జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దుండగులు ఎంత ప్రణాళికాబద్ధంగా ఈ చోరీ చేశారనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *