Salary Hikes: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు!

Salary Hikes: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు!


Salary Hikes: ఐటీ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు!

ఓ పక్క ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ AI రాకతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో దేశంలోనే ప్రముఖ టెక్ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) మాత్రం వాటికి బిన్నంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా తమ కంపెనీలోని ఉద్యోగులకు వార్షిక వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుండి అన్ని గ్రేడ్‌ల ఉద్యోగులకు జీతాల పెంపు వర్తిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎంత శాతం పెంచుతున్నారనేది కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సవాళ్లు ఉన్నప్పటికీ టాటా గ్రూప్ మాత్రం తమ ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తోంది. ఉద్యోగులకు ఆర్థికంగా భరోసాను కల్పిస్తోంది.ఇందులో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేవలం జీతాల పెంచడం మాత్రమే కాదు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా AI-ఫస్ట్ విదానాన్ని కూడా తీసుకువచ్చింది. తమ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడంపై కంపెనీ దృష్టి సారించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా అనుభవజ్ఞులైన 2,300 ఉద్యోగులను హైర్ చేసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్స్‌కు అవసరాలకు తగ్గట్టు తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై కంపెనీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

కంపెనీ ఆర్థిక ఫలితాలు

ఇక కంపెనీ ఆర్థిక ఫలితాల చూసుకుంటే TCS ఆర్థికంగా బలోపేతమైన వృద్ధిని కనబరిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో కంపెనీ 12 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.13వేల 718 కోట్ల నికర లాభాన్ని సాధించింది. రెవెన్యూ ఆదాయం పరంగా చూసుకుంటే కంపెనీ 9.6శాతం వృద్ధితో రూ. 70,698 బిజినెస్ చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *