పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..


పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

వేసవి వచ్చిందంటే మామిడి పండ్లతో పాటు మార్కెట్లో నోరూరించే మరో పండు పనస. ఆ సువాసన వింటేనే చాలు, తినని వారు కూడా ఒక్క ముక్కైనా రుచి చూడాలనుకుంటారు. రుచిలో తీయగా, గుజ్జు ఎంతో మృదువుగా ఉండే పనస పండులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది అందరికీ మేలు చేయదని, కొందరికి ఈ పండు విషంతో సమానమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పనస పండును ఎవరు తినాలి..? ఎవరు దూరంగా ఉండాలి..? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పోషకాల గని.. ఆరోగ్యానికి సిరి

పనస పండులో నీటి శాతం, పీచు పదార్థం అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనిలోని విటమిన్లు, ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.ఇందులోని విటమిన్-సి ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. పనస పండు పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, అంగస్తంభన సమస్యలను తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా కాపాడుతాయి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనస ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.

ఎవరు తినకూడదు..?

రుచిగా ఉంది కదా అని అతిగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ టెక్నాలజీ వెల్లడించింది.

మధుమేహ బాధితులు: పనస పండులో సహజ చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. అందుకే షుగర్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.

జీర్ణ సమస్యలు ఉన్నవారు: పనస పండు తిన్న తర్వాత కొందరిలో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి.

గర్భిణీ స్త్రీలు: గర్భధారణ సమయంలో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉన్నందున గర్భిణీలు పనస పండు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సలహా మేరకే తీసుకోవడం ఉత్తమం.

రక్తం గడ్డకట్టే సమస్యలు: బ్లడ్ కోగ్యులేషన్ సమస్య ఉన్నవారు పనస పండు తినకూడదు, ఇది ఆ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది.

పనస పండు కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, అది ఒక ఔషధం కూడా. అయితే ఏదైనా అతిగా తింటే నష్టమే. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా మితంగా తీసుకుంటేనే పనస ప్రయోజనాలను పూర్తిగా పొందగలరు. మీకు ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణులను సంప్రదించిన తర్వాతే ఈ పండును మీ డైట్‌లో చేర్చుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *