రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీకే నిత్యావసర సరుకులు!

రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీకే నిత్యావసర సరుకులు!


రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీకే నిత్యావసర సరుకులు!

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రేషన్ మార్ట్‌ల ద్వారా ప్రజలకు సబ్సిడీలో నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రేషన్‌ మార్టు ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో ​విజయవాడలోని మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మార్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

​ఈ రేషన్ మార్ట్‌లో బియ్యంతో పాటు పప్పు దినుసులు, రవ్వలు, కాస్మటిక్స్ విక్రయించాలని భావిస్తోంది. రేషన్ షాపుల్లో కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం, కందిపప్పు మాత్రమే కాకుండా.. నాణ్యమైన నూనెలు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి ఇతర నిత్యావసరాలను కూడా ఈ మార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ కంపెనీల వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మార్టుల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే ​రేషన్ డీలర్ల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే కమిషన్‌తో రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కూడా ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అయితే ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేయబోతున్న ఈ రేషన్‌ మార్ట్‌లకు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *