జ్ఞాపకశక్తి మందగిస్తోందా..? మీ వంటగదిలోనే ఉంది పరిష్కారం..!

జ్ఞాపకశక్తి మందగిస్తోందా..? మీ వంటగదిలోనే ఉంది పరిష్కారం..!


జ్ఞాపకశక్తి మందగిస్తోందా..? మీ వంటగదిలోనే ఉంది పరిష్కారం..!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మతి మరుపు అనేది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి అలవాటు పడటం వల్ల మెదడు పనితీరు మందగిస్తోంది. అయితే, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన ఆహారంతోనే జ్ఞాపకశక్తిని అద్భుతంగా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బయటి ఆహారంలో ఉండే ప్రిజర్వేటివ్స్, మితిమీరిన ఉప్పు, చక్కెర మెదడులోని నాడులను బలహీనపరుస్తాయి. దీనికి విరుద్ధంగా, ఇంట్లో వండుకునే భోజనంలో ఉండే పోషకాలు మెదడుకు కావాల్సిన ఇంధనాన్ని అందిస్తాయి. పాలకూర, తోటకూర వంటి వాటిలో ఉండే ఫోలేట్, విటమిన్ K మెదడు కణాల క్షీణతను అడ్డుకుంటాయి. మన వంటింట్లో ఉండే యాంటీ సెప్టిక్ పసుపు. ఇందులో ఉండే కర్కుమిన్ మెదడులోని వాపును తగ్గించి, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. వాల్ నట్స్, బాదం, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు చురుకుదనానికి తోడ్పడతాయి.

రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాల వల్ల మెదడుకు శక్తి నిరంతరాయంగా అందుతుంది. పేగు ఆరోగ్యం బాగుంటేనే మెదడు బాగుంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతాయి. మనం తీసుకునే ఆహారం కేవలం కడుపు నింపడానికే కాదు.. అది మన ఆలోచనా సరళిని, జ్ఞాపకశక్తిని కూడా నిర్దేశిస్తుంది. ఇంట్లో వండుకున్నా సరే, మితిమీరిన కారం, నూనె మెదడుపై ప్రభావం చూపుతాయి. రోజూ ఒక సీజనల్ పండు తినడం వల్ల మెదడుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి.డీహైడ్రేషన్ వల్ల కూడా మతిమరుపు వస్తుంది, కాబట్టి రోజూ సరిపడా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

జ్ఞాపకశక్తి పెరగడానికి ఖరీదైన టానిక్కులు అవసరం లేదు. మన ఇంట్లోని వేడి వేడి ఇంటి భోజనమే మన మెదడుకు శ్రీరామరక్ష. కాబట్టి బయటి తిండికి చెక్ పెట్టి.. ఇంటి రుచులకు ప్రాధాన్యత ఇవ్వండి.

గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *