Ambati Rambabu: జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

Ambati Rambabu: జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు


Ambati Rambabu: జైలుకెళ్లిన ఘటనపై టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, ఇతర కేసుల్ బెయిల్ పొంది ఇటీవల జైలు నుంచి బటయకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమిపై బాధపడలేదుని, మదనపడ్డామని తెలిపారు. జైలుకు వెళ్లడంపై తనకు అస్సలు భయపడలేదని.. జైలుకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలు దారుణమని ఆయన చెప్పుకొచ్చారు. తాను కావాలని ఎవరినీ దూషించలేదని.. ఆ సందర్భం వేరని అన్నారు.

ఆ క్షణంలో నోరు జారానని.. ఆ తరువాత పశ్చాతాపం వ్యక్తం చేశానని తెలిపారు. ఏడు గంటలకుపైగా నా ఇల్లు, ఆఫీస్‌పై దాడి చేసి భయపెట్టారన్నారు. ఆ సమయంలో పోలీస్ అధికారులెవరూ స్పందించలేదు అంబటి తెలిపారు. గతంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలకు తన వ్యాఖ్యలకు సంబంధం లేదని.. పట్టాభి ఇప్పటివరకు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదన్నారు. తాను కమ్మవారిని తిట్టినట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారని.. తాను ఇప్పటివరకు ఎప్పుడూ కులాల పేరుతో దూషించలేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *