
సాహసం చేయరా ధురంధరా అన్నట్టుంది ఇప్పుడు సిట్చువేషన్. కొన్ని విషయాల్లో బిట్వీన్ ద లైన్స్ ని చదివితే విషయం ఇంకా బాగా అర్థమవుతుందంటారు. మరిప్పుడు ధురంధర్ విషయంలో ఒకటికి రెండు సంగతుల మీద ఫోకస్ పెంచుతున్నారు ఆడియన్స్. మరి ఆ విషయాలు ధురంధర్ ద రివెంజ్‌కి మంచే చేస్తాయా? చూసేద్దాం పదండి. ధురంధర్ రన్ టైమ్, మల్టిప్లెక్సుల్లో షోస్, టిక్కెట్ హైక్స్ గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఈ మూవీకి ముంబైలో రిక్లైనర్ సీట్ టిక్కెట్స్ 3100 రూపాయలు పలుకుతున్నాయి. దాదాపు నాలుగు గంటలు రన్ టైమ్ ఉంది. ఈ నిడివి వల్ల సింగిల్ థియేటర్స్ కి పెద్దా ఫరక్ పడదు కానీ, మల్టిప్లెక్సుల్లో షోస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంత హైప్ తెచ్చుకున్న ధురంధర్ సీక్వెల్‌లో పోర్షన్స్ ఎక్కడైనా బోర్ అనిపించినా, సినిమా నిడివి విసుగు తెప్పించినా వెంటనే కలెక్షన్లు డ్రాప్ కావడం ఖాయం. అందుకే ధురంధర్2కి ఫస్ట్ షో టాక్ అత్యంత కీలకం. ఏమాత్రం డివైడ్ టాక్ వినిపించినా… భారీగా పెరిగిన టిక్కెట్ రేట్ల దృష్ట్యా, థియేటర్లలో ఫుట్‌ఫాల్స్ కి మొత్తానికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ది రివెంజ్ గురించి జనాలు ఇన్ని రకాలుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటే, బేఫికర్‌గా ఉండమని సలహా ఇస్తున్నారు ఆదిత్య ధర్. ప్రతి సీక్వెన్స్, ప్రతి కేరక్టర్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు ఆదిత్య ధర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కర్ణాటకలో ఎగ్జిబిటర్స్ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో