Headlines

Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??

Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??


Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??

ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా? అంటే… ఏమో ఇప్పుడే గట్ల గురించి ఏం చెప్పలేమని అంటున్నారు రుక్మిణి వసంత్‌ కెరీర్‌ని గమనించిన వారు. రుక్మిణి వసంత్‌ తారా జువ్వలా దూసుకుపోతున్నారని అందరూ భావిస్తున్న ఈ టైమ్‌ లో, ఆగండాగండి.. ఒక్క సారి ఈ విషయాలను చూడండి.. ఇప్పుడు చరెప్పండి నెక్స్ట్ సినిమాల సంగతులు అని అంటున్నారు. ఇంతకీ ఏంటా అబ్జర్వేషన్‌.. మనమూ మాట్లాడుకుందాం.. కాంతార చాప్టర్‌ 1లో రిషబ్‌ శెట్టి రోల్స్ ని ఎలా మర్చిపోలేమో, యువరాణి కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్‌ని కూడా మర్చిపోలేం. ఆద్యంతం అందంగా కనిపిస్తూ, అంతకు మించిన ట్విస్టులతో ఆకట్టుకున్నారు రుక్మిణి వసంత్‌. సప్తసాగరాలు దాటి మూవీ చూసిన వారికి ఆమె మీద అదో రకమైన క్రష్‌ ఉండేది. అది కాంతారతో రెట్టింపయింది. అయితే కన్నడ తప్ప… ఇతర భాషలు రుక్మిణికి కలిసి రావడం లేదనే టాక్‌ భీభత్సంగా వైరల్‌ అవుతోందిప్పుడు. తమిళంలో ఆమె నటించిన మదరాసి, ఏస్‌ లాస్ట్ ఇయర్‌ రిలీజ్‌ అయ్యాయి. రెండు సినిమాలూ క్లిక్‌ కాలేదు. అలాగే తెలుగులో 2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రిలీజ్‌ అయింది. ఈ మూవీ కూడా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో తారక్‌తో కలిసి నటిస్తున్నారు రుక్మిణి. ఆమె గత రికార్డులను బట్టి ఈ సినిమా గురించి ఆలోచించాలా? లేకుంటే ఇప్పుడు కాంతార తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి పాజిటివ్‌ వైబ్‌ అనుకోవాలా? నీల్‌ బేస్‌ కన్నడ కాబట్టి కచ్చితంగా క్లిక్‌ అవుతారనుకోవాలా? వీటిలో రుక్మిణికి ఏది కలిసొస్తుంది? తారక్‌ – నీల్‌ సినిమాకు ఏ టాక్‌ ప్లస్‌ అవుతుంది.. ఇలాంటి ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరుగుతోంది ఇండస్ట్రీలో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా

Dhurandhar 2: భారీ నిడివి ధురంధర2కి వరమా ?? శాపమా ??

కర్ణాటకలో ఎగ్జిబిటర్స్‌ కీలక సమావేశం. ఓటీటీ రిలీజ్‌కు 8 వారాల గడువు ఉండాల్సిందే

Gold Price Today: తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గే అవకాశం

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *