Headlines

పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి

పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి


పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి

పట్టుచీరలు అంతగా నచ్చితే డబ్బులు పెట్టి కొనాలమ్మా.. ఇలా కొట్టేయకూడదు… ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బట్టలదుకాణాల యజమానులు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో కస్టమర్లు బట్టలు కొనేందుకు మహిళలు షాపులకు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా చేసుకొని కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆఫర్ల రద్దీని ఆసరాగా చేసుకుని ఖరీదైన పట్టుచీరలను మాయం చేస్తున్న ముగ్గురు ముసలి బమ్మాళీలు సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన ఘటన భద్రాచలంలోని ఆర్కే షాపింగ్ మాల్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో, ఆర్కే షాపింగ్ మాల్ యాజమాన్యం పట్టుచీరలపై ప్రత్యేక ఆఫర్లతో పాటు, పురుషులకు 1+1 వంటి ఆకర్షణీయమైన సేల్‌ను ప్రకటించింది. దీంతో మాల్ కస్టమర్లతో కిక్కిరిసిపోయింది. ఈ రద్దీని గమనించిన ముగ్గురు వృద్ధ మహిళలు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. కస్టమర్ల ముసుగులో లోపలికి ప్రవేశించి, గంటల తరబడి ఏమీ కొనకుండా హడావిడి చేస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన పట్టుచీరలను తమ వెంట తెచ్చుకున్న సంచుల్లోకి చేరవేశారు. వీళ్ల హడావిడి చూస్తుంటే ఎక్కడో కొడుతుంది అని భావించిన సిబ్బంది అనుమానం వచ్చి సీసీ టీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. అందులో ఈ ముగ్గురు వృద్ధ మహిళలు చీరలను చాకచక్యంగా మాయం చేస్తున్న దృశ్యాలను చూసి షాకయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని నిలదీయగా, దొరికిపోయామని గ్రహించిన ఆ మహిళలు తప్పించుకునే మార్గం లేక యాజమాన్యం కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడ్డారు. చివరకు షాపింగ్ మాల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం

ఇరాన్‌ ‘దోమల దండు’ దెబ్బకి.. అమెరికా వెన్నులో వణుకు

Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..

ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..

Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *