చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు


చిరంజీవి, మహేష్‌లతో ఉన్న ఈకుర్రాడిని గుర్తు పట్టారా? ఒకప్పుడు టైలర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు

పై ఫొటోలో చిరంజీవి, మహేష్ బాబులతో ఉన్న కుర్రవాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు ఇతను సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. టాలీవుడ్ కు చెందినప్పటికీ తన ట్యాలెంట్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే సుమారు 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతను నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను, నాలుగు నంది పురస్కారాలను కూడా గెలుచుకున్నాడు. చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నితిన్, రవితేజ, ప్రభాస్, నాగ చైతన్య.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితోనూ పని చేశాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా ఇతను ఉండాల్సిందే. ఛత్రపతి మొదలు కుని మొన్నటి ఆర్‌ఆర్‌ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాలోనూ ఇతన కాంట్రిబ్యూషన్ ఉంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ లెవెల్ కు వెళ్లిపోయాడు ఇతను. ఇటీవల కింగ్ ఆఫ్ పాప్ ‘మైఖేల్ జాక్సన్’కు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ‘విన్సెంట్ ప్యాటర్సన్ ఇతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో ఇప్పుడు ఇతని పేరు నెట్టింట తెగ మార్మోగిపోతోంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్

తెలుగు, తమిళంలో దాదాపు 200కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఇక అతను కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు సాంగ్ కు అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ ‘మైఖేల్ జాక్సన్’ దగ్గర పనిచేసిన లెజెండరీ కొరియోగ్రాఫర్ ‘విన్సెంట్ ప్యాటర్సన్’ ప్రేమ్ రక్షిత్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒకసారి ప్రేమ్ ను కలవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. దీంతో ప్రేమ్ రక్షిత్ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది.

రాజమౌళితో ప్రేమ్ రక్షిత్ మాస్టర్..

 

View this post on Instagram

 

A post shared by Prem Rakshith (@premrakshith_choreographer)

కాగా కెరీర్ ప్రారంభంలో టైలర్‌ షాపులో పని చేశాడు ప్రేమ్ రక్షిత్. ఆ తర్వాత చిన్నాచితకా సినిమాల్లో కొరియోగ్రఫీ చేశాడు. ఇదే క్రమంలో రాజమౌళి ఇంట్లో పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించేవాడు. తన ట్యాలెంట్ తో దర్శక ధీరుడని మెప్పించాడు. ఇక ఆ తర్వాతి సంగతి తెలిసిందే. తన డ్యాన్స్ స్కిల్స్ తో టాలీవుడ్ లో తిరుగులేని కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్.

జాతీయ అవార్డు అందుకుంటూ..

 

View this post on Instagram

 

A post shared by Prem Rakshith (@premrakshith_choreographer)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *