
ఒక శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. నిశ్చితార్థం ముగిసిన తర్వాత వరుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన తల్లి, కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో వెలుగుచూసింది. ద్రోణాదుల గ్రామానికి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత దంపతుల కుమార్తె దివ్య హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మార్టూరుకే చెందిన మరో సాఫ్ట్వేర్ ఉద్యోగితో గతేడాది డిసెంబర్ 14న దివ్యకు నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా, ఈ నెల 4వ తేదీన వరుడు దివ్యను, ఆమె తల్లిదండ్రులను తన నివాసానికి పిలిపించాడు. హైదరాబాద్‌లో దివ్యను రహస్యంగా అనుసరించి తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలను చూపించి, తాను ఈ పెళ్లి చేసుకోనని వరుడు తెగేసి చెప్పాడు. ఈ పరిణామంతో తీవ్ర అవమానానికి, మనస్థాపానికి గురైన తల్లి సుజాత, కుమార్తె దివ్య మార్టూరులోనే ఎలుకల మందు, గడ్డి మందు కొనుగోలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరూ ఆ మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని చిలకలూరిపేట, అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన దివ్య గురువారం ఉదయం 5 గంటలకు, తల్లి సుజాత ఉదయం 10 గంటలకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
10th Class Exams: ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
కుక్కల్ని వీధుల్లో వదిలేసి.. దేశాన్ని వీడుతున్న జనం