
హెర్మూజ్ జలసంధి కంట్రోల్‌ని పూర్తిగా తన చేతుల్లో తీసుకోవడానికి ఇరాన్ ఓ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. వాటి సామర్థ్యం చూసి అమెరికా వెన్నులో వణుకు పుడుతోంది. అమెరికా మూడు భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపింది. అయితే అవి హోర్మూజ్ వైపు వచ్చేందుకు సాహసించడం లేదు. ఇరాన్ సేనలు మాత్రం అమెరికా నౌకలు ఎప్పుడు వచ్చినా అభ్యంతరం లేదని.. వాటికి తగిన సమాధానం చెబుతామని ప్రకటించింది. ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్మూజ్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చిన్నపాటి ఫాస్ట్ బోట్స్ ను ‘‘మస్కిటో ఫ్లీట్’’గా పిలుస్తారు. ఇవి సముద్ర వ్యూహంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 10 టన్నుల బరువుండే ఈ ఫాస్ట్ బోట్స్ 1,500 వరకు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాకిస్తున్నాయి. ‘కామికేజ్’ సూసైడ్ డ్రోన్ లు ఒకసారి టార్గెట్‌ను గుర్తిస్తే, నేరుగా వెళ్లి ఆ నౌకను ఢీకొట్టి పేలిపోతాయి. ఇటీవల అదే జరిగింది. అమెరికా నౌకను కామికేజ్ సూసైడ్ డ్రోన్ ఢీకొట్టడంతో భారతీయ నావికుడు మృతి చెందాడు. శత్రువుల సోనార్ల కంటికి చిక్కకుండా ప్రయాణం చేసి 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళతాయి.యుద్ధ నౌకలను లేదా వాణిజ్య నౌకలను రహస్యంగా సమీపించి పేల్చివేయడానికి దీనిని ఇరాన్ వాడుతోంది. మరోవైపు ఇరాన్.. కొన్ని డ్రోన్లను కేవలం నిఘా కోసమే వాడుతోంది. ఇవి అమెరికా యుద్ధ నౌకల కదలికలను రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి ఇరాన్ బలగాలకు అందిస్తాయి. ఖైబర్ లేదా మైన్-క్లియరింగ్ డ్రోన్లను కూడా ఇరాన్ వాడుతోంది. సముద్రంలో మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేస్తాయి. ఇక మిసైల్ బోట్లు 300 వరకు ఇరాన్ దగ్గరున్నాయి. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజి సూపర్ సోనిక్ గైడెడ్ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వాస్తవానికి ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా అవసరమైన దిక్కుకు మళ్లే అవకాశాలు లేవు. దీంతో అవి చిన్న బోట్ల దాడులకు ఎరగా మారుతున్నాయి. ఇక ఇరాన్ దళాల వద్ద అజదార్ అనే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. దీనిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్ పన్నుతున్న ఈ వ్యూహాలు అమెరికా-ఇజ్రాయెల్ ఖర్చును భారీగా పెంచాయి. హర్మూజ్‌పై ఆ దేశాలు పట్టు సాధించడం అంత సులువేం కాదన్న స్థితిని తీసుకొచ్చాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika: నెల తిరగకముందే.. కొత్త పెళ్లి కూతురికి కోపం తెప్పించారు..
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్ ఇచ్చాడు..
Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి
సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి