
జ్యోతిషశాస్త్రంలో నక్షత్రాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రధాన గ్రహాల సంచారం మీద వాటికి సంబంధించిన నక్షత్రాల ప్రాధాన్యం, అదృష్టం ఆధారపడి ఉంటాయి. జూన్ వరకు కొన్ని నక్షత్రాల వారు ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. భరణి, పునర్వసు, పుష్యమి, స్వాతి, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర అనేక విధాలైన అదృష్టాలు కలిగే అవకాశం ఉంది. వీరికి రాజయోగాలు, ధన యోగాలతో పాటు, మనసులోని కోరికల్లో ముఖ్యమైనవి నెరవేరుతాయి. కొన్ని సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల ఫలిస్తుంది.
- భరణి: శుక్రుడికి సంబంధించిన ఈ నక్షత్రం మేష రాశిలో ఉన్నందువల్ల జూన్ నెల వరకు ఈ నక్షత్రం వారికి ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తూనే ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందే అవకాశం ఉంది.
- పునర్వసు: గురు గ్రహానికి సంబంధించిన ఈ నక్షత్రం మిథున, కర్కాటక రాశుల్లో ఉన్నందువల్ల ఈ నక్షత్రంలో పుట్టిన వారి దశ త్వరలో తిరుగుతుంది. జీవన శైలి ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ది చెందుతుంది. ఆస్తిపాస్తులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది.
- పుష్యమి: శనికి సంబంధించిన ఈ నక్షత్రం వారికి మరో మూడు నెలల పాటు జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. సిరిసంపదలు, భోగభాగ్యాలకు లోటుండదు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు పూర్తయ్యే అవకాశం ఉంది.
- స్వాతి: ఈ నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభ రాశిలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ నక్షత్రం వారికి ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. అనారోగ్యానికి తగ్గ వైద్య చికిత్స లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉన్నత స్థితికి చేరుకుంటుంది.
- పూర్వాషాఢ: శుక్ర గ్రహానికి చెందిన ఈ నక్షత్రం ఈ నెల ద్వితీయార్థం నుంచి జూన్ వరకు ఒక వెలుగు వెలగబోతోంది. ఈ నక్షత్రానికి చెందిన వారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కుతారు. ఒక సంస్థకు ఉన్నతాధికారి లేదా సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. వీరి ఆధ్వర్యంలో వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదా యం పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి.
- ఉత్తరాభాద్ర: శనీశ్వరుడికి చెందిన ఈ నక్షత్రం వారికి రాజయోగాలు కలుగుతాయి. రాజకీయాలు, ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. రాజ పూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్న తులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు. శీఘ్ర పురోగతి ఉంటుంది.