
అయ్యో పాపం పసిపిల్లలు.. భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని మరణ శాసనం రాసింది ఓ తల్లి. ఇద్దరు కొడుకులతో కలిసి చెరువులోకి దూకింది తల్లి. నీట మునిగిన ముగ్గురు మృతి చెందారు. చెరువులో విగతజీవులుగా కనిపించిన వారిని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త ఎంతగా వేధింపులకు గురిచేసి ఉండకపోతే, ఇంతటి విషాదానికి కారణం అనే వాదన వినిపిస్తోంది.
కర్నూలు సమీపంలోని గార్గేయపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి గార్గేయపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం అలంపూర్ కి చెందిన రాజుతో గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి(36) కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి అబ్రహం (6) సుకుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలం సంసారం సజావుగానే సాగింది. ఇటీవల భార్యాభర్తల గొడవలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే ఇటీవల భర్తతో ఘర్షణపడ్డ రాజేశ్వరి పుట్టిన ఊరు గార్గేయపురంలో కొన్ని రోజులుగా ఉంటుంది. ఏమైందో ఏమో గానీ శుక్రవారం (మార్చి 13) సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి చెరువులో దూకేసింది. శనివారం ఉదయం ముగ్గరు మృతదేహాలు బయట పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..