Actress Poorna: రెండోసారి అమ్మయిన హీరోయిన్ పూర్ణ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Actress Poorna: రెండోసారి అమ్మయిన హీరోయిన్ పూర్ణ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్


Actress Poorna: రెండోసారి అమ్మయిన హీరోయిన్ పూర్ణ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ నటి షమ్నా ఖాసీం అలియాస్ పూర్ణ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో మెరిసిన ఆమె రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందింది. శనివారం (మార్చి 14) న ఉదయం తనకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు పూర్ణ వెల్లడించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ ఆ అల్లాహ్ ఆశీస్సులతో ఈరోజు ఉదయం 4 గంటల 25 నిమిషాలకు పాప పుట్టింది. తను మాకు లభించిన అపురూపమైన కానుక. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ అయినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆస్పత్రి బృందానికి కూడా ధన్యవాదాలు’ అని స్పెషల్ థ్యాంక్స్ నోట్ రాసుకొచ్చింది పూర్ణ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమ వివాహం చేసుకుంది పూర్ణ. 2022లో దుబాయ్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంద అందాల తార. ఈ దంపతుల అన్యోన్య బంధానికి ప్రతీకగా వీరికి 2023లో లో హమదన్ ఆసిఫ్ అలీ అనే బాబు పుట్టాడు. ఇక గతేడాది ఆగస్టులో మరోసారి గర్భం దాల్చింది పూర్ణ. ఇప్పుడు పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది.

పేరుకు మలయాళ నటినే అయినా అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అవును, లడ్డూ బాబు, నువ్వలా నేనిలా, అవును 2, జయమ్ము నిశ్చయమ్మురా, సిల్లీ ఫెలోస్, దసరా, తీస్ మార్ ఖాన్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పించింది పూర్ణ.

పూర్ణ ఎమోషనల్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by DrShanid Thalekoden (@dr.shanid_asifali)

అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందీ అందాల తార. చాలా రోజులకు మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’లో కుర్చీ మడతపెట్టి పాటతో రీఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప్రస్తుతం పలు డ్యాన్స్, టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

భర్త, కుమారుడితో హీరోయిన్ పూర్ణ..

 

View this post on Instagram

 

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *