సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి

సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి


సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి

ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌లోని సామాన్యుడి వంటగదిపై గట్టిగానే పడుతోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వంటగ్యాస్ (LPG) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కనీస కాలపరిమితిని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దేశంలో గ్యాస్‌ కొరత లేదని, గృహవినియోగదారులు నిశ్చింతగా ఉండొచ్చని చెప్పిన కేంద్రం.. సిలిండర్‌ బుకింగ్‌ గడువు 25 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవరణ చేస్తూ గురువారం కొత్త అప్‌ డేట్‌ ఇచ్చింది. ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు షాకిచ్చినట్టయింది. కొత్త నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత, తదుపరి రీఫిల్ కోసం వినియోగదారులు ఏకంగా 45 రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న 25 రోజుల గడువును పెంచడం వల్ల గ్రామీణ వాసులపై భారం పడనుంది. అయితే, పట్టణ మరియు నగర ప్రాంతాల్లో మాత్రం పాత నిబంధన ప్రకారం 25 రోజుల గ్యాప్ కొనసాగనుంది. గ్యాస్ నిల్వలను అందరికీ సమానంగా పంపిణీ చేయడానికే ఈ వ్యత్యాసాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కమర్షియల్ సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏజెన్సీలు వీటిని రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వినియోగదారులు ముందుజాగ్రత్తగా సిలిండర్లను బ్లాక్‌లో నిల్వ చేసుకోవడం వల్లే కొరత మరింత తీవ్రమవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. డిమాండ్‌ను నియంత్రించి, అందరికీ గ్యాస్ అందేలా చూడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !

Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *