
తన జీవితంలో తారక్ లేని లోటు ఎవరూ తీర్చలేని లోటు అన్నారు ఆయన సతీమణి అలేఖ్య. పిల్లలే ఇప్పుడు తనకు ప్రపంచమని తెలిపారు. తనను అత్తింటి కుటుంబం ఎందుకు అంగీకరించలేదో ఇప్పటికీ తెలియదని అన్నారు. ఏదో ఒక రోజు వారు అంగీకరిస్తారనే నమ్మకం ఉందన్నారు. తన భర్త ఎంతో సింపుల్‌గా ఉండేవారని, గొప్ప కుటుంబం నుంచి వచ్చాననే అహం అసలు ఉండదన్నారు. అందరికీ అందుబాటులో ఉండటం అతని గుణం అని చెప్పారు. ఇప్పుడు నందమూరి కుటుంబం ఎవరితోనూ తాను టచ్‌లో లేనని చెప్పారు. తాను చిన్నాన్న విజయసాయి రెడ్డి ఇంట్లోనే పెరిగానని.. వారు తనకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నట్లు తెలిపారు. తన చిన్నాన్న విజయసాయి రెడ్డి ఒక్కోసారి తన ఫోన్ కూడా ఎత్తరని.. కానీ తారకరత్న ఫోన్ చేస్తే ఏ సిట్యువేషన్లో ఉన్నా వెంటనే ఫోన్ ఎత్తుతారని వివరించారు. వైఎస్ షర్మిల జీవితంలో ఎప్పడూ తన చేయి వదల్లేదని చెప్పారు. ఆమె ఎప్పుడూ తనతో పాటు తన బిడ్డల క్షేమం కోరతారని చెప్పారు. బాలయ్య సైతం నిత్యం మాట్లాడకపోయినా.. తాను, పిల్లలం ఎలా ఉన్నామో ఎంక్వైరీ చేస్తూనే ఉంటారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఒక కుటుంబ సభ్యురాలిగా తాను నిరసన కార్యక్రమానికి వెళ్లినట్లు అలేఖ్య వివరించారు. అప్పుడు తప్ప తాను ఎప్పుడూ పొలిటికల్ కార్యక్రమాల్లో ఏ పార్టీ తరపున పాల్గొనలేదని వివరించారు.
తారకరత్న కుప్పుకూలిపోయిన రోజు ఉదయం.. తాను సాయంత్రానికి ఇంటికొస్తానని తనకు చెప్పినట్లు అలేఖ్య గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత విషయం తెలిసి.. కాల్ చేయగా తారక్ డిహైడ్రేషన్కు గురైనట్లు తెలిపారని వివరించారు. ఆ తర్వాత చంద్రబాబు గారి నుంచి కాల్ వచ్చిందని.. ఆయన కుప్పం వెళ్తున్నారా అని అడిగేసరికి.. సిట్యువేషన్ సీరియస్ అని తనకు అర్థం అయిందన్నారు. ఆ తర్వాత డాక్టర్ కాల్ చేసి పరిస్థితిని వివరించారని.. దీంతో తాను కుప్పకూలినట్లు వివరించారు. ఆ తర్వాత తాను కుప్పం వెళ్లానట్లు వివరించారు. ఆ తర్వాత 23 రోజులు తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. తనకు తోడుగా బాలయ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని అలేఖ్య తెలిపారు. ఆ 23 రోజులు అనుక్షణం తారకరత్నతో ఉన్నానని.. ఆయన చివరి హార్ట్ బీట్ కూడా తాను విన్నట్లు తెలిపారు.
ఇక పొలిటికల్ ఎంట్రీపై సైతం అలేఖ్య స్పందించారు. పాలిటిక్స్‌లోకి వెళ్లాలని కానీ.. పోటీ చేయాలని కానీ లేదని.. బట్ రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.. ఈరోజు ఏం జరిగింది అన్నదే ముఖ్యమని ఆమె కామెంట్స్ చేశారు.
Also Read: ఫర్టిలైజర్స్ ఏం వాడకుండా సంవత్సరమంతా తోటకూరను ఇలా పెంచొచ్చు..