Shubman Gill : సంజూ శాంసన్ సక్సెస్ చూసి గిల్ అసూయపడుతున్నాడా? వైరల్ పోస్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఇదే

Shubman Gill : సంజూ శాంసన్ సక్సెస్ చూసి గిల్ అసూయపడుతున్నాడా? వైరల్ పోస్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఇదే


Shubman Gill : సంజూ శాంసన్ సక్సెస్ చూసి గిల్ అసూయపడుతున్నాడా? వైరల్ పోస్ట్ వెనుక ఉన్న మిస్టరీ ఇదే

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించి, మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆనందంలో దేశమంతా మునిగిపోయింది. అయితే ఈ ఆనందం మధ్య సోషల్ మీడియాలో ఒక అనవసర వివాదం చెలరేగింది. భారత స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జట్టు సభ్యులందరూ కలిసి దిగిన ఫోటోను గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఆ ఫోటోలో టోర్నీ హీరో సంజూ శాంసన్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ గిల్ మీద విరుచుకుపడుతున్నారు. సంజూని కావాలనే ఫోటో నుంచి ఎడిట్ చేసి తొలగించారంటూ గిల్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం గిల్, సూర్యకుమార్ యాదవ్ షేర్ చేసిన ఫోటోల మధ్య తేడాలే. సూర్య షేర్ చేసిన ఫోటోలో సంజూ శాంసన్ వెనుక భాగంలో కనిపిస్తుండగా, గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో మాత్రం సంజూ జాడ లేదు. దీంతో గిల్ కావాలనే సంజూని క్రాప్ చేశాడని, సంజూ సాధించిన విజయాలను చూసి గిల్ అసూయపడుతున్నాడని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ టోర్నీలో సంజూ శాంసన్ 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‎గా నిలవగా, గిల్ వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే గిల్ ఇలా ప్రవర్తించాడనేది ఫ్యాన్స్ వాదన.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

అయితే ఈ వైరల్ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వాస్తవాలు చెబుతున్నాయి. నిజానికి ఆరోజు వేడుకల సమయంలో వేర్వేరు యాంగిల్స్ నుంచి వేల ఫోటోలు క్లిక్ చేశారు. గిల్ షేర్ చేసిన ఫోటోలో ఆటగాళ్ల అమరిక వేరేగా ఉండటం వల్ల సంజూ శాంసన్ కనిపించలేదు. గిల్ మాత్రమే కాదు, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్ వంటి క్రీడాకారులు కూడా అదే ఫోటోను షేర్ చేశారు. అందులోనూ సంజూ కనిపించలేదు. అంటే అది ఒక ప్రత్యేకమైన యాంగిల్‌లో తీసిన ఫోటో మాత్రమే కానీ, ఎడిటింగ్ చేసింది కాదు. సూర్యకుమార్ యాదవ్ షేర్ చేసిన ఫోటో వేరే సమయంలో తీసింది కావడంతో అందులో సంజూ కనిపిస్తున్నారు. కేవలం ఒక ఫోటో ఆధారంగా గిల్‌పై బురద చల్లడం సరికాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)

ఏది ఏమైనా, ఈ వరల్డ్ కప్ సంజూ శాంసన్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. వరుసగా 97*, 89, 89 వంటి అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గిల్ వివాదం ఎలా ఉన్నా, సంజూ ఆటతీరును చూసి క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతోంది. మైదానంలో ఆటగాళ్ల మధ్య వైరం కంటే, వారి మధ్య ఉన్న సమన్వయమే భారత్‌కు కప్పు తెచ్చిపెట్టిందని వాస్తవాలను గ్రహించాలని ఫ్యాన్స్‌కు నిపుణులు సూచిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *