Nuvvunte Naa Jathaga: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి కారణం ఆమెనే.. అర్జున్ కళ్యాణ్ బయటపెట్టిన నిజాలు..

Nuvvunte Naa Jathaga: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి కారణం ఆమెనే.. అర్జున్ కళ్యాణ్ బయటపెట్టిన నిజాలు..


Nuvvunte Naa Jathaga: నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోవడానికి కారణం ఆమెనే.. అర్జున్ కళ్యాణ్ బయటపెట్టిన నిజాలు..

సాధారణంగా బుల్లితెరపై తెలుగు అమ్మాయిలు, అబ్బాయిలు హీరోహీరోయిన్లుగా కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు తమిళం, కన్నడ సెలబ్రెటీలు మాత్రమే తెలుగులో అత్యధికంగా సీరియల్స్ చేస్తున్నారు. అలాంటి వారి పోటీని తట్టుకుని తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అర్జున్ కళ్యాణ్. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఇటీవల నువ్వుంటే నా జతగా సీరియల్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించారు. అయితే మంచి టీఆర్పీ రేటింగ్ ఉన్న సమయంలోనే ఈ సీరియల్ ను ఆపేశారు మేకర్స్. ఇందుకు గల కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అర్జున్ కళ్యాణ్. ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, ముఖ్యంగా నువ్వుంటే నా జతగా సీరియల్ లోకి ప్రవేశించడానికి గల కారణాలు, దాని అనుభవాలు, సీరియల్ అకస్మాత్తుగా ముగియడానికి దారితీసిన పరిస్థితుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను మొదట సినిమాలపైనే పూర్తి దృష్టి సారించానని, ఆ క్రమంలో ఆరు, ఏడు టాప్ సీరియల్ ఆఫర్లను తిరస్కరించానని తెలిపారు. తన సినిమా కుషి సరైన రీతిలో విడుదల కాకపోవడం, ప్రమోషన్లు చేసినా ఆదరణ దక్కకపోవడంతో నిరాశ చెందానని చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

నువ్వుంటే నా జతగా సీరియల్ అకస్మాత్తుగా ఎందుకు ముగిసిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. అనేక కారణాలు ఉన్నాయని అర్జున్ కళ్యాణ్ వివరించారు. కథనం ప్రకారం, హీరోయిన్ గర్భవతి అయ్యి, ఐదేళ్ల జనరేషన్ గ్యాప్ తర్వాత కొడుకుతో తిరిగి వచ్చే కథాంశానికి హీరోయిన్ అంగీకరించలేదని తెలిపారు. ఆ తర్వాత స్క్రీన్ ప్లే మార్చడానికి రెండు, మూడు ప్రయత్నాలు చేసినా అవి నచ్చలేదని, అసలు కథాంశంపైనే వారు మొగ్గు చూపారని వివరించారు. తాను ఒక రౌడీగా మారి, హీరోయిన్ గర్భవతి అయిన సమయంలో జైలుకెళ్లి, తిరిగి వచ్చాక తన కూతురిని కలుసుకునే “డాడీ” సినిమా తరహా కథనం అది అని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

ఈ స్క్రీన్ ప్లేకు హీరోయిన్ ఒప్పుకోకపోవడంతో ఆమె స్థానంలో ఎన్నెన్నో జన్మల బంధం కథానాయిక దేవియానితో రీప్లేస్ చేసే ప్రయత్నం కూడా జరిగిందని, తానూ ఎక్సైట్ అయ్యానని, అయితే బీబీ జోడి షూటింగ్ నుండి తిరిగి వచ్చేసరికి సీరియల్ నిలిపివేశారని తనకు చెప్పారని తెలిపారు. ఛానెల్, నిర్మాణ సంస్థల మధ్య సంబంధాలు సరిగా లేకపోవడం, నిర్మాణ సంస్థ నష్టాల్లో ఉండటం వంటివి కూడా కారణమై ఉండొచ్చని అర్జున్ అభిప్రాయపడ్డారు. సీరియల్ ఆకస్మిక ముగింపు కారణంగా, అనేక కీలకమైన లూప్‌లు (కథానాయిక కుటుంబం ఆమోదం, విలన్‌కు సంబంధించిన కథనం) అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, బీబీ జోడి పూర్తి కావడంతో, తన తాతయ్య మరణం వంటి వ్యక్తిగత కారణాల వల్ల ఒక నెల విరామం తీసుకుంటున్నానని, ఆ తర్వాత సీరియల్ ఆఫర్లను పరిశీలిస్తానని అర్జున్ కళ్యాణ్ వివరించారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *