Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు నిజమేనా? అసలు విషయం చెప్పేసిన మేనేజర్

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు నిజమేనా? అసలు విషయం చెప్పేసిన మేనేజర్


Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు నిజమేనా? అసలు విషయం చెప్పేసిన మేనేజర్

కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి బ్రాండ్‌ స్ట్రాటజర్‌ కావేరి బరూవా చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపాయి. బన్నీని కలవాలంటే 42 నిబంధనలు పాటించాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టంట బాగా వైరలయ్యాయి. అయితే వీటిపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్ వెంటనే కావేరి బరువా కామెంట్స్ ను ఖండించింది. తాజాగా ఇదే విషయంపై అల్లు అర్జున్‌ మేనేజర్‌ శరత్‌చంద్ర నాయుడు స్పందించారు. ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన ఆయనకు ‘అల్లు అర్జున్‌ను కలవాలంటే ప్రొటోకాల్స్‌ ఉంటాయనే చర్చ సాగుతోంది?అసలు అది నిజమేనా?’ అని ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన శరత్ చంద్ర నాయుడు అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్‌ను కలవడం కష్టమని అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

నిర్మాతగా మారిన బన్నీ మేనేజర్

జ‌ర్న‌లిస్టుగా ప్ర‌యాణం ప్రారంభించిన శ‌ర‌త్‌ చంద్ర ఆ త‌ర‌వాత ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. గత కొన్నేళ్లుగా అల్లు అర్జున్ మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఈయన నిర్మాత‌గా మారారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ రూపొందించిన ‘గుర్తుకొస్తున్నాయ్‌’ సిరీస్‌కి శరత్ చంద్ర నిర్మాత‌ గా వ్యవహరిస్తున్నారు. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ ఇందులో హీరోగా న‌టిస్తున్నాడు. వినోద్ గాలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విరాజ్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (మార్చి 13) గుర్తుకొస్తున్నాయి సిరీస్ టీజర్ కూడా విడుదలైంది. త్వరలోనే ఈటీవీ విన్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది.

అల్లు అర్జున్ తో మేనేజర్ శరత్ చంద్ర..

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ మరో మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ రెండు సినిమాల నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *