ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి

ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి


ఎగ్జిబిటర్‌ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్‌ దిశగా లొల్లి

ఎగ్జిబిటర్లకు… డిస్ట్రిబూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సంటేజ్‌కి ఓకే చెప్పకుంటే… తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు… మార్చి 12 న మరోసారి బెంగళూరులో సమావేశమవ్వడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం… ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టు బిగించేలా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమమ్ 8 వారాల గడువు ఉండాల్సిందేనంటున్నారు ఎగ్జిబిటర్లు. సినిమా హిట్ అండ్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా 8 వారాల తర్వాతే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసుకోవాలంటున్నారు. సినిమా థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి వస్తే తాము నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్సంటేజ్ వ్యవహరంపైనా మరోసారి చర్చించారు. థియేటర్లతో రెంటల్ సిస్టమ్ రద్దు చేయాలన్నారు. ఎంతశాతం పర్సంటేజ్‌ అనేది త్వరలోనే మరో మీటింగ్ నిర్వహించి నిర్ణయిస్తామంటున్నారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ థియేటర్స్‌కి కూడా వసూళ్లలో పర్సంటేజీ ఇవ్వాలనేది ఎగ్జిబిటర్ల ఎప్పటినుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే… అద్దె ప్రాతిపదిక ద్వారా తమకి ఆదాయం ఉండడం లేదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అయితే మున్ముందు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కి ఉండటం… ఎగ్జిబిటర్లు వరుస మీటింగులు పెట్టి పర్సంటేజ్‌ల వ్యవహారంపై తెగ చర్చిస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. వీళ్ల నిర్ణయాలపై ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ సంస్థల అధినేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే

Vijay Thalapathy: తండ్రి మీద కోపంతో.. ఇంటి పేరు మార్చుకున్న విజయ్‌ కొడుకు

Dhurandhar 02: కొండెక్కిన ధురంధర్ 2.. ప్రీమియర్ టికెట్ రేట్లు

Allu Arjun: బన్నీ సినిమా నుంచి అవాక్కయ్యే లాంటి అప్డేట్

Manoj: ఇక సాకులు చెప్పను.. మనోజ్ షాకింగ్ పోస్ట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *