కావాల్సిన పదార్ధాలు : 250 గ్రాములు కొర్రమిను చేపలు, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ధనియాల మసాలా పొడి , రెండు కప్పుల శనగపిండి,ఒక కప్పు నూనెను తీసుకోవాలి.
ముందుగా కొర్రమీను చేపలను తీసుకుని, వాటికి ఉప్పు వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ తర్వాత ఈ ముక్కలకు ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి.
మ్యారీనేట్ చేసిన చేప ముక్కలను తీసుకుని వీటికి కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, నిమ్మరసం వేసి బాగా మిక్స్ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకునివాటిలో ఎండు చేప ముక్కలు, శనగపిండి, కరివేపాకు , కొంచం నీళ్ళు పోసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
మొత్తం రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి, శనగ పిండి పట్టించిన చేప ముక్కలను తీసుకుని ఆయిల్ లి వేసి బ్రౌన్ కలర్ లోకి మారే వరకు బాగా వేయించుకోవాలి.




