
ఒక సింహం గర్జిస్తే దాని సౌండ్ సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపిస్తుంది. ఇది దాని ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, ఇతర సింహాలతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది. ఒక పెద్ద సింహం సుమారు 180 కిలోల బరువు ఉంటుంది. దాని భారీ శరీరానికి తగినట్లుగానే, ఇది ఒకేసారి 40 కిలోల మాంసాన్ని సులభంగా తినగలదు. ఈ బరువు ఉన్నప్పటికీ, సింహాలు గంటకు 80 కిలోమీటర్ల అద్భుతమైన వేగంతో పరుగెత్తగలవు. ఇది వాటి వేట సామర్థ్యానికి నిదర్శనం.
సింహాలు ఎల్లప్పుడూ గుంపులలోనే నివసిస్తాయి. ఈ గుంపును కాపాడుకోవడానికి అవి ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉంటాయి. తమ కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెడతాయి. సింహం పంజా దెబ్బ శక్తిని తక్కువ అంచనా వేయలేము. 180 కిలోల ఫోర్స్‌తో ఒక పెద్ద సుత్తితో కొడితే ఎలా ఉంటుందో, సింహం పంజా దెబ్బ కూడా అంతే బలంతో ఉంటుంది. ఈ దెబ్బకు పెద్ద జంతువులు కూడా నిస్సహాయంగా మట్టిపాలవ్వాల్సిందే. అడవికి రాజైన సింహం అనేక ఆసక్తికరమైన లక్షణాలను కలిగి ఉంది. ఈ శక్తివంతమైన జంతువు రోజులో ఎక్కువ భాగం విశ్రాంతి తీసుకుంటుంది. సుమారు 20 గంటల పాటు నిద్రపోతుంది. మిగిలిన నాలుగు గంటల్లో మాత్రమే వేటాడుతుంది. ఆశ్చర్యకరంగా, వేట పని ఆడ సింహాలదే. మగ సింహాలు తమ స్థావరాన్ని రక్షించడంలో నిమగ్నమై ఉంటాయి, అయితే వేట పూర్తయిన తర్వాత ఆహారాన్ని ముందుగా మగ సింహాలే స్వీకరిస్తాయి.
ప్రతి మగ సింహం జూలు ప్రత్యేకంగా ఉంటుంది, దాని ఆరోగ్యం, వయస్సు, బలాన్ని సూచిస్తుంది. సింహం పంజా దెబ్బ ఎముకలను విరగ్గొట్టగలదు. ఒకసారి వేటను ప్రారంభించిన తర్వాత, లక్ష్యం చేరే వరకు అవి ఆగవు. ఒక సింహం గర్జిస్తే, చుట్టుపక్కల ఉన్న ఇతర సింహాలు ఉత్సాహంతో ప్రతిస్పందిస్తాయి. సింహాలు గుంపులుగా జీవిస్తాయి, వీటిని ప్రైడ్ అంటారు, ఒక్కో ప్రైడ్‌లో 15 నుండి 30 సింహాలు ఉండవచ్చు. వాటికి జ్ఞాపకశక్తి ఉంటుంది, ఒక మనిషి ముఖాన్ని గుర్తుంచుకోగలవు. తెల్ల రంగు సింహాలు (వైట్ లైన్స్) చాలా అరుదైనవి, ప్రపంచంలో ప్రత్యేకమైనవి.
ఇది చదవండి: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా