మన జీవితంలో నిద్రపోయే సమయంలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మరికొన్ని కలలు మాత్రం మనలో భయం, ఆందోళనలను రేకెత్తిస్తాయి. కలలు అనేవి మన మనసులోని ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాలు, రోజువారీ జీవితంలో ఎదురైన సంఘటనల ప్రభావంతో ఏర్పడతాయని చాలా మంది భావిస్తారు. అందుకే ప్రతి కలకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉందని కూడా అనేక సంప్రదాయ విశ్వాసాలు చెబుతుంటాయి.
అలాంటి కలల్లో ఒకటి పులి కనిపించడం. పులి అనేది శక్తి, ధైర్యం, అధికారం, భయానికి ప్రతీకగా భావించబడే జంతువు. అందువల్ల చాలామంది తమ కలలో పులిని చూసినప్పుడు భయపడటం సహజమే. అయితే కలలో పులి కనిపించడం ఎప్పుడూ చెడు సూచన అని కాదు. కొన్ని సందర్భాల్లో అది మన జీవితంలో వచ్చే మార్పులు, మనలో ఉన్న ధైర్యం లేదా ఎదుర్కోవాల్సిన సవాళ్లను సూచించవచ్చు.
పులి ఇలా కనిపిస్తే మాత్రం..
కలలో పులి మనపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తే, అది మన జీవితంలో ఉన్న ఒత్తిడి, భయం లేదా ఎవరో మనకు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితిని సూచించవచ్చు. అంటే మనం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నామని లేదా ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించవచ్చు.
కలలో పులి కనిపిస్తే..
కలలో పులి కనిపించడం అనేది చాలా అద్భుతమైన, శుభప్రదమైన సంకేతం. పులి కేవలం కనబడి, మనకు ఎటువంటి హాని చేయకుండా కనిపిస్తే, దాని ఫలితం చాలా సానుకూలంగా ఉంటుంది.
ఊహించని ధనలాభం..
ఇలాంటి కల మనకు రాబోయే రోజుల్లో ఊహించని ధనలాభం కలుగుతుందని సూచిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడటమే కాకుండా, మనం చాలా కాలంగా ఎదురుచూస్తున్న లేదా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. కాబట్టి, కలలో పులి కనిపించడం అనేది చాలా మంచిదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇది అదృష్టానికి, విజయానికి సంకేతం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)




