విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్


విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన.. ఇదిగో షెడ్యూల్

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 నుంచి విద్యా సంవత్సరం చివరి పని దినం వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. పాఠశాలలు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పని చేస్తాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ వడ్డిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక సూచనలు:

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులకు సన్నద్ధత కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులు యధావిధిగా కొనసాగుతాయి. పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల విషయంలో విద్యాశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఏ పాఠశాలల్లో అయితే SSC పరీక్షా కేంద్రాలు ఉన్నాయో, ఆ పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1:00 గంట నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయి. పరీక్షలు లేని సాధారణ రోజుల్లో మాత్రం మిగిలిన పాఠశాలల వలె ఉదయం 8:00 నుండి 12:30 వరకు ఒంటిపూట బడులుగానే కొనసాగుతాయి.

ఈ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతీయ విద్యాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *