
ఈ క్రమంలో ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటికి చేరుకున్న డెలివరీ బాయ్.. నేరుగా వితాయతిల్పై దాడికి దిగాడు. విచక్షణారహితంగా ముక్కుపై బలంగా గుద్దడంతో వితాయతిల్ కిందపడిపోయారు. దీంతో భయపడిపోయిన డెలివరీ బాయ్.. ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పారేసి క్షణాల్లోనే పరారయ్యాడు. అయితే కాసేపటికే తేరుకున్న బాధితుడు తీవ్ర రక్తస్రావం కావడంతో.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే పరీక్ష చేసిన వైద్యులు అతడి ముక్కు ఎముక విరిగినట్లు ధ్రువీకరించారు. అయితే ఓ వ్యక్తి దాడి చేయడం వల్లే అతడి ముక్కు ఎముక విరిగిపోవడంతో.. వైద్యులు పోలీసులను రంగంలోకి దింపారు. ఇలా బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం :