LPG Crisis: ఇదేందిరా నాయానా? 14 కేజీల సిలిండర్‌ ధర రూ.2800..!

LPG Crisis: ఇదేందిరా నాయానా? 14 కేజీల సిలిండర్‌ ధర రూ.2800..!


LPG Crisis: ఇదేందిరా నాయానా? 14 కేజీల సిలిండర్‌ ధర రూ.2800..!

LPG Cylinders Crisis: ముందే దేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ కొరత నెలకొంది. ఇతర దేశాల్లో యుద్ధం కారణంగా ఈ సమస్య నెలకొంది. అయితే ముందే గ్యాస్‌ కొరతతే ఇబ్బందిగా ఉంటే ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు బ్లాక్‌ మార్కెట్లో సిలిండర్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలో LPG సరఫరాలపై ఒత్తిడి పెరుగుతోంది. గల్ఫ్ దేశాల నుండి గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలుగుతుందనే భయాల మధ్య, అనేక నగరాల్లో గ్యాస్ సిలిండర్ కొరత, బ్లాక్ మార్కెటింగ్ నివేదికలు వెలువడ్డాయి.

ఇది కూడా చదవండి: LPG Gas: ఒక గంట పాటు గ్యాస్‌ సిలిండర్‌పై వంట చేస్తే ఎన్ని కిలోల ఎల్‌పీజీ అవసరం.. లెక్క తేల్చేద్దాం రండి..!

పరిస్థితి చాలా దారుణంగా మారింది. సరఫరాను సమతుల్యం చేయడానికి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లపై 25 రోజుల పరిమితిని విధించాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం అనేక ప్రాంతాలలో గ్యాస్ కొరతను మరింత పెంచింది. ఇంతలో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుండి ఒక షాకింగ్ సంఘటన బయటపడింది.

ఇది LPG సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. బ్లాక్‌ మార్కెట్‌కు 524 గ్యాస్ సిలిండర్‌లను (రూ.17.33 లక్షలు) మోసుకెళ్తున్న ట్రక్కు పట్టుబడింది. గ్యాస్ సిలిండర్‌లను పొందడానికి అదనంగా చెల్లించాల్సిన వస్తోందని చాలా మంది టీవీ9తో వాపోయారు. అలాగే హైదరాబాద్‌లో కూడా బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్‌ను అమ్ముతున్నట్లు కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 2800

నోయిడాలోని సెక్టార్ 126లో ఎల్‌పిజి గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. రిటైలర్లు ఎల్‌పిజి గ్యాస్‌ను కిలోకు రూ.200కు అమ్ముతున్నారు. నోయిడాలోని రాయ్‌పూర్ ఖాదర్‌లోని సెక్టార్ 126 నివాసి దీపికా చౌహాన్ తన ఇంటికి సమీపంలోని దుకాణానికి గ్యాస్ రీఫిల్ చేయడానికి వెళ్ళినప్పుడు దుకాణదారుడు ఆమెకు కిలోకు రూ.200కు గ్యాస్ ఇచ్చాడు. కిలోకు రూ.200 చొప్పున 14.2 కిలోల సిలిండర్ ధర రూ.2,800 మించిపోయింది. నోయిడాలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.900-రూ.950. అంటే బ్లాక్‌ మార్కెట్లో కొందరు మూడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.

ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలు.. హైదరాబాద్‌లో లీటర్‌కు ఎంత?

ఆమె రాత్రంతా గ్యాస్‌ కోసం తిరినా లభించలేదు:

గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఒక సొసైటీలో నివసిస్తున్న గృహిణి డింపుల్ కౌర్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి ఒక వ్యక్తి బ్లాక్ మార్కెటింగ్ కోసం సిలిండర్ కొనమని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇందిరాపురంకు తనను పిలిచాడని చెప్పారు. వచ్చిన తర్వాత కూడా ఆమెకు గ్యాస్ దొరకలేదని డింపుల్ చెప్పారు. గ్యాస్ కొరత కారణంగా బ్లాక్ మార్కెటర్ల నుండి అధిక ఛార్జీలు వసూలు అవుతున్నాయని ఆమె అన్నారు. 2,000-2,500 రూపాయలు చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ఇప్పటికీ దానిని పొందలేకపోయానని ఆమె వాపోయింది.

జీవనోపాధిపై సంక్షోభం

గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని సెక్టార్ 16Bలో మోమో స్టాల్ నడుపుతున్న రాజు, సిలిండర్ల కొరత తన ఆందోళనలను పెంచిందని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న సిలిండర్‌లోని గ్యాస్‌తో తాను సజావుగా సాగుతున్నానని, కానీ బ్లాక్ మార్కెటింగ్ పెరుగుదల, సిలిండర్లు అందుబాటులో లేకపోవడం ఆందోళనకు గురవుతున్నట్లు చెప్పాడు.

ఇది కూడా చదవండి: Bank Notes: 10, 20, 50 రూపాయల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *