Headlines

Telangana: ఒకే చోట ప్రాణాలు విడిచిన ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు..

Telangana: ఒకే చోట ప్రాణాలు విడిచిన ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు..


Telangana: ఒకే చోట ప్రాణాలు విడిచిన ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు..

మహబూబాబాద్ జిల్లాలో విషాద సంఘటన జరిగింది.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. హైదరాబాద్‌కు వెళ్తున్న మరో స్నేహితుడికి సెండ్ ఆఫ్ చెప్పి వస్తూ ఆ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.. దీంతో ఇరు కుటుంబాలలో ఊహించని విషాదం అలముకుంది.. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన వీరి స్నేహం మరణంలోనూ వీడలేదు.. ఒకరిపై మరొకరు పడి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలుచూసి ఊరంతా బోరుమంటుంది.

మహబూబాబాద్ జిల్లా లక్షతండా వద్ద ఈ ప్రమాదం జరిగింది.. ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరి యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. ప్రమాద సమయంలో ఒకరికొకరు హత్తుకొని ప్రాణాలు విడిచారు.  మృతులు ఇద్దరు మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్, భిక్షంలుగా గుర్తించారు.. వీళ్లిద్దరూ మరో స్నేహితుడు హైదరాబాద్‌కు వెళ్తుండగా అతనికి సెండ్ ఆఫ్ చెప్పి బస్సు ఎక్కించి స్వగ్రామానికి తిరిగి వెళుతున్నారు.. ఈ క్రమంలో లచ్చతండా వద్ద వీరు వెళ్తున్న బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.. ఇద్దరు స్నేహితులు ఒకరిపై మరొకరు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..

చిన్నప్పటినుండి కలిసిమెలిసి తిరిగిన ఈ ఇద్దరు స్నేహితులు మరణంలోనూ స్నేహం వీడలేదు.. వీరి మరణవార్త తెలియగానే ఊరంతా బోరుమంటుంది.. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు డెడ్ బాడీస్ ను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.. ఆస్పత్రి పరిసరాలతో పాటు స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *