LPG Crisis: గ్యాస్ సంక్షోభం వేళ.. ఇండక్షన్ స్టవ్ విప్లవం

LPG Crisis: గ్యాస్ సంక్షోభం వేళ.. ఇండక్షన్ స్టవ్ విప్లవం


LPG Crisis: గ్యాస్ సంక్షోభం వేళ.. ఇండక్షన్ స్టవ్ విప్లవం

ఎంత విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయంటే.. కర్నూలులో సివిల్ సప్లయిస్ అధికారులు సడెన్ రెయిడ్ చేశారు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల మీద. 108 సిలిండర్లు సీజ్ చేశారట. నార్మల్ వార్తలాగే కనిపించొచ్చు గానీ.. జనరల్‌గా కల్తీ ఫుడ్ సీజ్ చేయాల్సిన చోట పోయిపోయి సిలిండర్లు సీజ్ చేయడమే కాస్త డిఫరెంట్ న్యూస్. ఇక బిర్యానీకి ఫేమస్ అయిన హైదరాబాద్ షాగౌస్ లాంటి హోటల్స్‌లో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నారు. బట్.. ఎలా? కట్టెల పొయ్యి పెట్టి. మధురై, బెంగళూరులో కూడా హోటళ్లు కట్టెల పొయ్యిలతో నడుస్తున్నాయి. అసలు హోటళ్లన్నీ ఇప్పుడిదే దారిలో వెళ్తున్నాయి.. మరీ హోటల్ క్లోజ్ చేసి ఖాళీగా ఉండలేక..! అన్నట్టు.. కట్టెలు, బొగ్గు ధర విపరీతంగా పెరిగిందట. ఇక పిస్తా హౌజ్‌లో తయారయ్యే మొత్తం ఫుడ్ ఐటమ్స్ 756. అందులో ఏకంగా 750 రకాల ఫుడ్ ఐటమ్స్‌ని కట్ చేసింది.. గ్యాస్ లేక. చెప్పుకుంటూ పోవాలే గానీ.. ఎన్నని. బోలెడు..!

ఆకాశాన్నంటుతున్న ఎల్‌పీజీ ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయల మార్కును దాటడంతో, నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమవుతున్న తరుణంలో కోల్‌కతా వాసులు ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. సంప్రదాయ గ్యాస్ పొయ్యిలను పక్కన పెట్టి, విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్‌ వైపు మళ్లుతున్నారు. గ్యాస్ ధరల భారం మోయలేక మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గృహిణుల అంచనా ప్రకారం.. గ్యాస్‌తో పోలిస్తే ఇండక్షన్ స్టవ్‌పై వంట చేయడం వల్ల నెలకు అయ్యే ఖర్చులో 30 నుంచి 40 శాతం వరకు ఆదా అవుతోంది. ఇది ఆర్థికంగానే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో కోల్‌కతాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ మార్కెట్లలో వంటగది ఉపకరణాల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గత కొన్ని నెలలుగా ఇండక్షన్ కుక్కర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎయిర్ ఫ్రయర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం పొదుపు కోసమే కాకుండా, తక్కువ నూనెతో ఆరోగ్యకరమైన వంటలు చేసుకునేందుకు వీలుగా ప్రజలు ఎయిర్ ఫ్రయర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియని అనిశ్చితి నెలకొనడంతో, శాశ్వత పరిష్కారం కోసం విద్యుత్ ఉపకరణాలే మేలని వినియోగదారులు భావిస్తున్నారు. “ప్రతి నెలా సిలిండర్ కోసం వేల రూపాయలు వెచ్చించడం కంటే, వంటగదిని ఆధునీకరించుకోవడం ద్వారా దీర్ఘకాలికంగా ప్రయోజనం పొందుతున్నామని స్థానిక వినియోగదారులు పేర్కొంటున్నారు. మొత్తానికి, గ్యాస్ మంటలు కోల్‌కతా వంటింట్లో సరికొత్త ‘ఎలక్ట్రిక్’ విప్లవానికి దారితీశాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *