వినియోగదారులకు అలర్ట్‌.. గ్యాస్‌ బుకింగ్‌పై కొత్త రూల్స్‌ ఇవే

వినియోగదారులకు అలర్ట్‌.. గ్యాస్‌ బుకింగ్‌పై కొత్త రూల్స్‌ ఇవే


వినియోగదారులకు అలర్ట్‌.. గ్యాస్‌ బుకింగ్‌పై కొత్త రూల్స్‌ ఇవే

దేశంలో నెలకొన్న ఇంధన లభ్యత సవాళ్ల దృష్ట్యా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వాణిజ్య, గృహ అవసరాల ఎల్‌పీజీ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రెండు గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ మధ్య ఉన్న 15 రోజుల కనీస సమయాన్ని ప్రభుత్వం ఇప్పుడు 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఇంధన సరఫరాపై ప్రభావం పడటంతో, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశీయ చమురు ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టింది కేంద్రప్రభుత్వం. చమురు శుద్ధి కర్మాగారాలు ఎల్‌పీజీ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని కేంద్రం సూచించింది. అదనంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ప్రాధాన్యత క్రమంలో ముందుగా గృహ వినియోగదారులకు సరఫరా చేయాలని ఆదేశించింది.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్‌పీజీని గృహేతర (Non-domestic) అవసరాలకు కేటాయించనున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు మరియు హాస్టళ్లకు సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది. హోటళ్లు, రెస్టారెంట్లపై పడుతున్న ప్రభావం, అలాగే గ్యాస్ సరఫరాను నిరంతరం సమీక్షించేందుకు చమురు మార్కెటింగ్ సంస్థలకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతిరోజూ దేశవ్యాప్త నిల్వలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, దేశీయ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని మంత్రిత్వ శాఖ ధీమా వ్యక్తం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *